జీవితంలో ఎవరైనా ఒక్క సారి ఉన్నత స్థానానికి చేరుకున్నాక వెనక్కి చూసుకుంటే వారు అధిరోహించిన ఎన్నో శిఖరాలు కనిపిస్తాయి.ఆ ప్రయాణంలో వారు ఎన్నో కొత్త విషయాలను ఎదుర్కొనే ఉంటారు.
మరి సినిమా వాళ్ళ జీవితం లో ఎన్నో సినిమాల్లో నటిస్తారు ఎంతో అనుభవం గడిస్తారు .మరి వారి జీవితాల్లో ఎలాంటి గొప్ప విషయాలు ఉంటాయో ఒక ఉదాహరణ చూద్దాం.ఇక సినిమా ఇండస్ట్రీలో నాటి దిగ్గజ నటులు ఎవరైనా ఉన్నారు అంటే ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారు ముందుగా గుర్తొస్తారు.ఈ నటులంతా కూడా హీరోలుగా తొలుత మద్రాసులో వారి కెరీర్ ని ప్రారంభించారు.
కానీ మాతృభాష పైన ఉన్న ప్రేమతో సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కు తరలించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
చాలామంది హీరోలు అక్కడ తమకు గల ఆస్తులను అమ్ముకొని మరి హైదరాబాద్ కి వచ్చినవారే.
ఇక్కడికి వచ్చి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాలతో స్టూడియోలు నిర్మించి, సినిమాలను తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి బీజం వేశారు.అయితే ఇలా టాలీవుడ్ కి బీజం వేయడానికి గల ముఖ్య కారకులు మాత్రం ఎన్టీఆర్ మరియు అక్కినేని.
ఈ విషయం టాలీవుడ్ లో ఎవ్వరిని అడిగినా చెబుతారు.ఇక్కడ ఇండస్ట్రీ నిలబడడానికి వీరినే మూల పురుషులనే చెప్పుకోవచ్చు.
ఎవరి స్థాయిలో వారు తమ సినిమాలను తీస్తూ, ఇక్కడే షూటింగ్స్ జరుపుతూ స్టూడియోలు, థియాటర్లు సైతం కట్టి మిగతా సినిమాలకు ఆయువు పట్టుగానే నిలిచారు.

అయితే ఎవరైనా వారు చేసిన గొప్ప పనిని ఒప్పుకోరు కదా ? అలా ఓసారి జయప్రద ఇంటర్వ్యూలో అక్కినేనిని ఈ విషయంపై ప్రశ్నించింది.మీరు తెలుగు సినిమా పరిశ్రమకు మూల పురుషులు అంటూ ఆమె అనగానే అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు వింటే ఆయన ఎంత సింపుల్ మనిషో మనకు అర్థమవుతుంది.వారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి.
మేమిద్దరం మూల పురుషులమైతే మిగతా వారంతా ఎక్కడికి పోయారు.

కేవలం ఎన్టీఆర్, అక్కినేని వల్లనే సినిమా ఇండస్ట్రీ నిలబడలేదు.అప్పటి నటులు చాలామంది వారి వారి ఆస్తులను సైతం త్యాగం చేశారు.మద్రాసులో అన్నిటిని తెగ నమ్ముకుని హైదరాబాద్ కి వచ్చారు.
రాలేని వారు అక్కడే మిగిలిపోయారు.ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య లాంటి మహానుభావులు సైతం హైదరాబాద్ కు తరలివచ్చి తమతో పాటే ఇక్కడే కష్టపడి ఇండస్ట్రీని నిలిపారు అంటూ అక్కినేని తన తోటి నటులైన అందరిని గుర్తు చేసుకోవడం నిజంగా అక్కినేని సింప్లిసిటీని అందరికీ తెలిసేలా చేసింది.