ప్రిన్స్, సర్దార్ నైజాం డే 1 కలెక్షన్స్.. ఏ హీరో ఎంత రాబట్టాడంటే?

ఈసారి దీపావళికి మన తెలుగులో చిన్న సినిమాలు మాత్రమే సందడి చేస్తున్నాయి.పెద్ద హీరోలు ఒక్కరు కూడా ఈ సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేయలేదు.

 Day 1 Nizam Collections Of Sardaar And Prince, Sivakarthikeyan, Prince Anudeep K-TeluguStop.com

దీంతో చిన్న సినిమాలకు, డబ్బింగ్ సినిమాలకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.ఎందుకంటే పెద్ద సినిమాలు ఉంటే చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన ఎవ్వరు వాటి జోలికి వెళ్లరు.

కానీ పెద్ద సినిమాలు లేకపోతే చిన్న సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంటుంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఈసారి రెండు తెలుగు సినిమాలు రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

మరి కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఆ సినిమాలు ఏంటంటే ఒకటి ప్రిన్స్ సినిమా కాగా.మరొకటి సర్దార్ సినిమా.తమిళ్ హీరో శివకార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు సినిమా ఫేమ్ అనుదీప్ కె వి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రిన్స్.ఈ సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

బైలింగ్వన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.ఇక నైజాం లో ఈ సినిమా మొదటి రోజు బాగానే వసూళ్లు చేసినట్టు తెలుస్తుంది.పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ఈ సినిమాను సునీల్ నారంగ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించగా.ఇందులో బ్రిటీష్ భామ మరియా ర్యాబోష హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా నైజాం లో 53 లక్షల నెట్ వసూళ్లు చేసినట్టు సమాచారం.

Telugu Daynizam, Karthi, Kollywood, Nizam, Sardaar, Sivakarthikeyan-Movie

ఇక మరో సినిమా కార్తీ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన సర్దార్ సినిమా.ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుని దీపావళి సీజన్ లో గట్టిగ వసూళ్లు చేసేందుకు సిద్ధం అయ్యింది.నైజాంలో ఈ సినిమా మొదటి రోజు 57 లక్షల నెట్ వసూళ్లు చేసినట్టు టాక్.

తెలుగు సినిమాలతో సమానంగా ఈ సినిమాలను మనోళ్లు ఆదరించడం విశేషం.చూడాలి మరి ఈ సినిమాలు క్లోజింగ్ సమయానికి ఎంత రాబడతాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube