తెలుగు ప్రేక్షకుల ముందుకు దీపావళి కానుకగా అంటూ మూడు నాలుగు సినిమాలు వచ్చాయి.అందులో కొన్ని సినిమాలు చాలా నమ్మకం మధ్య విడుదల అయ్యాయి.
మరి కొన్ని మాత్రం సో సో గా ఉంటాయి అనుకున్నారు.మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా గురించి చాలా మంది చాలా రకాలుగా పాజిటివ్ గా ఉన్నారు.
కానీ జిన్నా సినిమా నిరాశ పర్చింది.ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో పాటు అసలు సినిమా ఇలా ఉంది ఏంటీ అంటూ విమర్శలు తెచ్చుకుంది.
సినిమాకు వస్తున్న వసూళ్లు ఆ సినిమా పరిస్థితి ఏంటో చెప్పకనే చెబుతోంది.ఇక ఓరి దేవుడా సినిమా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది.
పెద్దగా అంచనాలు ఉన్న సినిమా అది.వెంకటేష్ నటించడం వల్ల అందరూ కూడా ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు.కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చిందనే చెప్పాలి.ఇక జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ద్వి భాష చిత్రం ప్రిన్స్ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
బాబోయ్ ఇదేం సోది సినిమా రా బాబు అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు.

తెలుగు తో పాటు ఇతర భాషల్లో విడుదల అయిన సినిమా లు కూడా నిరాశ కలిగించాయి.ఇంకా దసరా కానుకగా వచ్చిన తెలుగు సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాయి.డబ్బింగ్ సినిమా లు కూడా దీపావళి కానుకగా విడుదల అయ్యాయి.
అందులో కూడా ఏ ఒక్కటి సక్సెస్ అవ్వలేదు.దాంతో గత వారం విడుదల అయిన కాంతార సినిమా నే ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కాంతార స్క్రీన్స్ పెరుగుతున్నాయి.షో లు కూడా పెరుగుతున్నాయి.
కనుక ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేయబోతుంది.దీపావళి కాంతారకు కలిసి వచ్చేలా ఇతర సినిమాలు చేశాయి అని చెప్పాలి.
దీపావళికి మూడు నాలుగు రోజులు సెలవు దినాలు వస్తున్నాయి.అందటి మంచి దీపావళి ఆఫర్ ను మన టాలీవుడ్ సినిమాలు మిస్ చేసుకున్నాయి.







