ఎంబీఎస్ జ్యూవెలర్స్ అధినేత సుఖేశ్ గుప్తాకు ఈడీ కస్టడీ విధించింది.మొత్తం తొమ్మిది రోజుల పాటు కస్టడీకి ఈడీ కోర్టు అనుమతి ఇచ్చింది.
దీనిలో భాగంగా ఈనెల 25 నుంచి నవంబర్ 2 వరకు సుఖేశ్ గుప్తా కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.అయితే అధికారులు 14 రోజుల కస్టడీ కోరగా తొమ్మిది రోజులకు కుదించింది.
ప్రస్తుతం సుఖేశ్ గుప్తా చంచల్ గూడ జైలులో ఉన్నారు.రుణాల ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో సహా పలు ఆరోపణలపై సుఖేశ్ గుప్తాను ఈడీ అదుపులోకి తీసుకుంది.