ఈ మధ్యకాలంలో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే కన్నడ భాషలో వచ్చినటువంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోగా తాజాగా రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా కూడా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది.
సెప్టెంబర్ 30వ తేదీ కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని అన్ని భాషలలో డబ్ చేసి విడుదల చేశారు.
ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను అల్లు అరవింద్ కొనుగోలు చేయగా తెలుగులో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.
ఇక ఈ సినిమా తెలుగులో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో హీరో రిషబ్ శెట్టి తెలుగులో కూడా మంచి క్రేజ్, మార్కెట్ ఏర్పడింది.ఈ క్రమంలోనే ఈయనకు తెలుగులో కూడా సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.
ఈయన నటించిన కాంతార సినిమాని అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేయడమే కాకుండా భారీగా లాభాలను పొందడంతో ఆయన సొంత బ్యానర్ లో రిషబ్ శెట్టి హీరోగా తెలుగు సినిమాని చేయడానికి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి అల్లు అరవింద్ ఈ విషయం గురించి మాట్లాడుతూ హీరో రిషబ్ శెట్టికి ఈ సినిమాతో తెలుగులో ఎంతో మంచి క్రేజ్ వచ్చింది.ఈ క్రమంలోని ఈయనతో కలిసి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక తెలుగు సినిమా చేయాలని తాను భావించానని అల్లు అరవింద్ తెలిపారు.ఇక తెలుగులో సినిమా చేయడానికి రిషబ్ శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అయితే రిషబ్ శెట్టి కమిట్ అయిన సినిమాలు పూర్తి కాగానే తెలుగు సినిమా చేయనున్నట్లు ఈయన ప్రకటించారు.