పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించింది.ఏపీ, తెలంగాణ, చత్తీస్గడ్, ఒరిస్సా రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ భేటీలో పోలవరం నిర్మాణంపై, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించారు.వరద ప్రభావం, బ్యాక్ వాటర్ పై పది రోజుల్లోగా రాతపూర్వకంగా తమ అభ్యంతరాలను తెలపాలని జనశక్తి శాఖ రాష్ట్రాలకు సూచించింది.
పోలవరం నిర్మాణంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని ఏపీ తెలిపింది.పోలవరం వరద ప్రభావం పై అంచనాకు ఉమ్మడి సర్వే చేయాలని ఒడిశా, చత్తీస్గడ్, తెలంగాణ తెలిపాయి.
అయితే వరద ప్రభావం పై మడి సర్వేకు ఏపీ అంగీకారం తెలపలేదు.