పొన్నియన్ సెల్వన్ ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఇవే !

సాధారణంగా ఎంతో మంది దర్శకులు భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య కొన్ని సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు.ఇక ఆ సినిమా సూపర్ డూపర్ కి విజయం సాధిస్తుందని రికార్డులన్నింటినీ కూడా తిరగరాస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకుంటారు.

 Director Mani Ratnam Ponniyin Selvan Flop Reasons Details, Director Maniratnam,-TeluguStop.com

కానీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన కొన్ని సినిమాల విషయంలో అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అన్న విధంగా మారిపోతూ ఉంటుంది.ఇక ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి.

చోళ రాజ వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని భావించాడు దిగ్గజ దర్శకుడు మణిరత్నం.గత మూడు దశాబ్దాల నుంచి ఇక ఈ స్టోరీని డ్రీమ్ ప్రాజెక్టుగా పెట్టుకున్నాడు.ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నటులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాను తెరకెక్కించాడు.ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెండి తెరపై వచ్చింది సినిమా.

కానీ భారీ అంచనాల మధ్య మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రేక్షకులను నిరాశపరిచింది.

పేలవ సన్నివేశాలు

ముఖ్యంగా రోమాంచిత అనుభూతికి గురి చేసే సన్నివేశాలు పొన్నియిన్ సెల్వన్ ఉంటాయని అభిమానులు అనుకున్నారు.కానీ ఏ సన్నివేశం కూడా అలాంటి ఫీల్ ప్రేక్షకులకు ఇవ్వలేదు.బాహుబలి, కెజిఎఫ్ ని మించి ఉంటాయని అందరు భావించిన అందుకు తగ్గట్టుగా మంచి సన్నివేశాలు , డైలాగులు లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది.

భారీ కాస్టింగ్

సినిమా కోసం ప్రతి పాత్ర కూడా ఎంతో భారీగా ఉండాలని భావించిన మణి రత్నం ఇండియా లెవల్లో పెద్ద స్టార్ క్యాస్ట్ ని పెట్టి సినిమా తీసిన ఒక్కరికి సరైన ప్రాధాన్యత లేకపోవడం తో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు ఉసూరుమన్నాడు.

తమిళ సెగ

పొన్నియన్ సెల్వన్ సినిమా పూర్తిగా తమిళ నేటివిటీ తో రావడం తో మిగతా బాషల వారు ఎక్కువగా ఆదరించలేకపోతున్నారు.

మణిరత్నం మార్కు లేకపోవడం

ఈ మధ్య కాలంలో సినిమా చూసే ప్రేక్షకుల నాడి మారింది.వారి అభిరుచులకు తగ్గట్టుగా మణి రత్నం సినిమాలు తీయలేకపోవడం కూడా పొన్నియన్ సినిమాకు అతి పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి.

కోట్లల్లో పాఠకులు ఉండటం

పొన్నియన్ సెల్వన్ కథ ఇప్పటికే నవలగా వచ్చి ఎన్నో ఏళ్లుగా కోట్ల మందిని అభిమానులుగా మార్చుకుంది.కథను మార్చితే సెట్ కాదు కాబట్టి అలాగే ఉంచాల్సి వచ్చింది.పోనీ అలాగే తీస్తే కొత్తదనం ఉండదు.ఈ చట్రం లో ఇరుక్కున్న మణి రత్నం సినిమాను గట్టెక్కించలేక పోయాడు.

కమర్షియల్ వ్యాల్యూస్

సినిమాను ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా అద్దలేకపోవడం ఒక మైనస్ అయితే కమర్షియల్ వ్యాల్యూస్ లేకపోవడం మరొక మైనస్.

ఇదిలా ఉంటే పోనియన్ సెల్వన్ మొదటి పార్ట్ కి ముందే రెండవ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశారట మణిరత్నం.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట.

మరి సెకండ్ పార్ట్ లో అయిన మణిరత్నం మొదటి పార్ట్ లో చేసిన తప్పులను సరి చేసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా బలమైన బావొద్వేగాలను జోడించి మళ్లీ రిషూట్ చేస్తారా లేదా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మణిరత్నం తప్పుల్ని సరిచేసుకునేందుకు రీ షూట్ చేస్తే మాత్రం ఇక సెకండ్ పార్ట్ పై కూడా అభిమానుల్లో అంచనాలు పెరిగిపోవడం ఖాయం అన్నది తెలుస్తుంది.

Ponniyin Selvan Movie Flop Reasons

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube