ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.లఖింపూరిఖేరిలో ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.మరో 25 మందికి గాయాలు అయ్యాయి.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.