తండ్రికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన లేడి కమెడియన్ రోహిణి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

బుల్లితెర నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి పరిచయం గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికి తెలిసిందే.మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది నటి రోహిణి.

 Lady Comedian Rohini Who Gave Surprise To Father Video Viral On Social Media Det-TeluguStop.com

ముఖ్యంగా తను నటించిన కొంచెం ఇష్టం.కొంచెం కష్టం సీరియల్ తో మాత్రం తన మాట తీరుతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత పలు సీరియల్లలో అవకాశాలు కూడా అందుకుంది.

మాటీవీలో శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్ తో కామెడీ కాకుండా తనలోని నటస్వరూపాన్ని కూడా బయటకు తెచ్చింది.

తర్వాత ఇన్స్పెక్టర్ కిరణ్ అనే సీరియల్ లో పోలీస్ పాత్రలో నటించింది.అలాగే జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ లో ఎన్నో అవార్డులను సంపాదించుకుంది.సీరియల్స్ తోనే కాకుండా తన కెరీర్ లో ఇంకా ఎదగాలని బిగ్ బాస్ కి వెళ్ళింది రోహిణి.

కానీ అనుకున్నంత ఫలితం రాకపోగా నాలుగో వారానికి తిరిగి వచ్చేసింది.

బిగ్ బాస్ తర్వాత కూడా రోహిణికి అనుకున్నంత అవకాశాలు రాలేదు.కొన్ని సినిమాల్లో నటించిన సరే తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది.

కానీ బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అవకాశం అందుకుంది.అందులో తన కామెడీతో బాగా నవ్విస్తూ ఉంటుంది.

జబర్దస్త్ తో పాటు ఇతర కామెడీ షో లలో కూడా కనిపిస్తూ ఉంటుంది రోహిణి.

ఇక.కేవలం టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో అందరికీ టచ్ లో ఉంటుంది.తన సోషల్ మీడియా ఖాతాలో తన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు పెడుతూ అందరి మనులను పొందుతూనే ఉంటుంది.

ఇక యూట్యూబ్లో తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంది రోహిణి.అందులో తను చేసే ప్రతి విషయాన్ని వీడియోలుగా అప్లోడ్ చేస్తుంది.ఆ ఛానల్ కి ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు.

అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా స్నేహితులతో అయినా లేకపోతే ఏ పండగ జరిగినా సరే వాటిని సరదాగా వీడియో తీసి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా యూట్యూబ్లో మరో వీడియో పంచుకుంది.అందులో తన తండ్రిని సర్ప్రైజ్ చేసింది రోహిణి.

తన తండ్రికి కొత్త బైక్ కొనిచ్చింది.తన తమ్ముడితో స్వయంగా షోరూం కి వెళ్లి తన తండ్రి గతంలో కోరిన బైకును తీసుకొని వచ్చింది.

తరువాత తన తండ్రికి ఆ బైక్ గిఫ్ట్ గా ఇవ్వడంతో తన తండ్రి ఎంతో సంతోషపడ్డాడు.ఇక రోహిణి చాలా సంతోషంగా కనిపించింది.అంతేకాకుండా తన తండ్రి బైకుపై ఒక ట్రిప్పు కూడా వేసింది.మొత్తానికి తన సొంత సంపాదనతో తండ్రికి బైక్ కొని తండ్రి కోరికను తీర్చింది.

ఇక ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారడంతో.ఆ వీడియోని చూసిన నెటిజన్స్ రోహిణి కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube