టాలీవుడ్ లో వచ్చే నెల సందడి వాతావరణం నెలకొనబోతుంది.ఎందుకంటే వచ్చే నెల అక్టోబర్ 5న దసరా కావడంతో వరుసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
మరి ఆ లిష్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు.ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాదర్ ఒకటి.
తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది.
చిరంజీవి 153వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై చాలా అంచనాలు నెలకొన్నాయి.ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆచార్య ప్లాప్ ను మరిపించే విధంగా చిరు హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు.
అయితే పరిస్థితులు చూస్తుంటే మాత్రం అలా లేవు.
మెగా ఫ్యాన్స్ ను పూర్తిగా భయపెట్టే విధంగా ఉన్నాయి.
టీజర్ దగ్గర నుండి ఈ సినిమా అసలు ఆకట్టుకుంది లేదు.టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసి థమన్ పై ట్రోల్స్ చేసారు.
ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ తో మరో సారి మెగా ఫ్యాన్స్ హార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ”థార్ మార్ తక్కర్ మార్” అనే సాంగ్ ను వారం రోజులు ఊరించి మరీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఈ సాంగ్ పై భారీ ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ ఆశలపై మేకర్స్ మరోసారి నీళ్లు చల్లారు.ఇందులో చిరుతో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఉండడం అలాగే ఈ సాంగ్ ను ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేయడంతో స్టెప్స్ ఎంత కొత్తగా ఉంటాయో అని ఆశ పడ్డారు.కానీ ఇక్కడ సీన్ చుస్తే మొత్తం రివర్స్ లో ఉంది.అసలు ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ నేనా అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.
ఈ సాంగ్ లో ప్రభుదేవా ఇలాంటి స్టెప్స్ పెడతాడు అని.ఇద్దరు స్టార్స్ తో ఇలాంటి స్టెప్పులు వేయిస్తాడు అని ఎవ్వరు అనుకోలేదు.ఈయన కంటే శేఖర్ మాస్టర్ నే బెటర్ అని అంటున్నారు.ఈ పాటలోని స్టెప్స్ చూసి ఎవడికి వచ్చినట్టు వేసుకోండి అని పెట్టారా అని ప్రభుదేవా పై ట్రోల్స్ చేస్తున్నారు.