మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.అయితే ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదనే సంగతి తెలిసిందే.
మంచు మనోజ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆయన అభిమానులు సైతం ఫీలవుతున్నారు.ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ధనరాజ్ మంచు మనోజ్ కు సన్నిహితుడు కావడం గమనార్హం.
ధనరాజ్ ఒక ఇంటర్వ్యూలో మనోజ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మనోజ్ తో నాకు మంచి రిలేషన్ ఉందని ధనరాజ్ పేర్కొన్నారు.మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంట్ తీగ సినిమాలో నేను నటించానని ధనరాజ్ చెప్పుకొచ్చారు.జంప్ జిలానీ ఆడియో లాంఛ్ లో మనోజ్, నేను ప్రాంక్ చేశామని ఆయన తెలిపారు.
అయితే అది వైరల్ అయిందని మొత్తం తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేశారని ధనరాజ్ అన్నారు.

ఆ తర్వాత మనోజ్ కు ట్రోల్స్ వస్తున్నాయని చెప్పానని మనోజ్ నాతో నేను చేతులు కట్టుకుంటానని నువ్వు నా మీద చెయ్యి వేస్తే ఆ ఫోటోను షేర్ చేద్దామని చెప్పారని ధనరాజ్ చెప్పుకొచ్చారు.అయితే మనోజ్ తో రెగ్యులర్ గా టచ్ లో మాత్రం ధనరాజ్ అన్నారు.మంచు మనోజ్ సినిమాలు చేయకపోవడం ఆయన వ్యక్తిగత విషయమని ధనరాజ్ చెప్పుకొచ్చారు.
ఏదో ఒక ప్లాన్ లో లేకపోతే ఆయన ఈ విధంగా చేయరని ధనరాజ్ అన్నారు.

మనోజ్ గారు బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆలోచనతోనే పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారని నేను అనుకుంటున్నానని ధనరాజ్ చెప్పుకొచ్చారు.ఈ కారణం వల్లే ఆయన టైమ్ తీసుకుంటున్నారని నేను భావిస్తున్నానని ధనరాజ్ అన్నారు.ధనరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.