అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తనపై వస్తున్న విమర్సలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంటారు.ఆయన అనుయాయులు, లేదంటే విమర్శను బట్టి వైట్ హౌస్ ఇలా ఎవరో ఒకరు ప్రతిగా బడులిస్తూనే ఉంటారు.
అయితే గడిచిన కొన్ని నెలలుగా ఆయనపై వస్తున్న ఓ కీలక విమర్సలకు ఎట్టకేలకు బిడెన్ బదులిచ్చారు.అమెరికాలో నిరుద్యోగ రేటు పెరుగుతోందని, నిరుద్యోగ బృతికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని బిడెన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఉద్యోగాల కల్పన చేపట్టలేకపోయారని ప్రతిపక్షాల నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి.
కానీ
ఈ విమర్శలపై గడిచిన కొన్ని నెలలుగా నోరు విప్పని బిడెన్ ఎట్టకేలకు సమాధానం చెప్పారు.తన హయాంలో జరిగినంత ఉద్యోగ కల్పన ఏ అధ్యక్షుడి హయాంలో జరగలేదని గట్టిగా బదులిచ్చారు.అమెరికాలో గడిచిన 50 ఏళ్ళలో ఏనాడు లేనట్టుగా నిరుద్యోగం 3.4 శాతానికి పడిపోయిందని తాను అధికారం చేపట్టిన తరువాత ప్రత్యేకంగా ఈ విషయంపై శ్రద్ద తీసుకోవడంతో సుమారు కోటి ఉద్యోగాలను కల్పించానని తెలిపారు.ఇప్పటికి వరకూ ఏ అధ్యక్షుడు కూడా కోటి ఉద్యోగాలను ఇంత తక్కువ కాలంలో అందించలేదని తెలిపారు.
అధ్యక్షుడిగా అధికారం చేపట్టక ముందు నిరుద్యోగం 3.7 శాతం ఉండేదని ప్రస్తుతం 3.4 కి తగ్గిందని చెప్పుకొచ్చారు బిడెన్.ఇదిలాఉంటే ఆగస్టు నెలలోనే 3.15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఇక జులై నెలలో సుమారు 5.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.కాగా బిడెన్ ప్రకటనతో ప్రతిపక్ష రిపబ్లికన్ నేతలు బగ్గు మంటున్నారు.
ట్రంప్ హయాంలో ఉద్యోగాలతో పోల్చితే బిడెన్ ఏ మాత్రం వృద్ది సాధించలేదని, స్థానికులకు ఉద్యోగాలు కల్పించడంతో బిడెన్ విఫలమయ్యారని, కోటి ఉద్యోగాలు ఇవ్వడం అనేది వాస్తవం కాదని విమర్శిస్తున్నారు.