షర్మిలది కాన్ఫిడెన్స్ కాదు ... ఓవర్ కాన్ఫిడెన్స్ ? 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి ఆ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని ప్రజాక్షేత్రంలో పర్యటనలు చేస్తున్నారు.

 Sharmila's Is Not Confidence Over Confidence Ys Sharmila, Ysrtp, Telangana, Kcr,-TeluguStop.com

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు,  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ షర్మిల యాత్రలు , నిరాహార దీక్షలు,  ఉద్యమాలు , ఆందోళనలు చేపడుతున్నారు.నిత్యం ఏదో ఒక అంశంపై టిఆర్ఎస్ ప్రభుత్వం పైన కెసిఆర్,  కేటీఆర్,  మిగతా మంత్రుల పైన తనదైన శైలిలో విమర్శలతో షర్మిల విరుచుకుపడుతున్నారు.

       రాజకీయంగా పై చేయి సాధించే క్రమంలో షర్మిల యాక్టివ్ గా ఉంటున్నారు.అయితే పార్టీలో ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోయినా,  చేరిన నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నా,  షర్మిల ఏమాత్రం లెక్క చేయడం లేదు.

తాను ఇదే దూకుడుతో ముందుకు వెళితే ఎన్నికల సమయం నాటికి బాగా బలం పుంజుకోవడంతో పాటు,  పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని,  ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు పార్టీలో చేరుతారని,  ఎన్నికల్లో విజయం సాధించి వచ్చని ఆమె భావిస్తున్నారు.అయితే కేవలం అధికార పార్టీ టిఆర్ఎస్ ను మాత్రమే ఆమె టార్గెట్ చేసుకోవడం, బిజెపి కాంగ్రెస్ లను పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఎవరికీ అర్థం కావడం లేదు.

ఇక ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఈ జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అభిమానులు ఎక్కువగా ఉండడం,  ఇక్కడి ప్రజల్లోనూ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానం తనను గెలిపిస్తుందనే నమ్మకంతో షర్మిల ఉన్నారు.   

Telugu Congress, Telangana, Ys Sharmila, Ysrtp-Political

    అయితే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయినా,  షర్మిల మాత్రం అవి ఏమి పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఇటీవల కాలంలో కొంతమంది మంత్రులు,  ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకొని షర్మిల తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు.ఈ వ్యాఖ్యలపై మంత్రులు , ఎమ్మెల్యేలు కలిసి ఇటీవలే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు .షర్మిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.  దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించడంతో , ప్రీవిలేజ్ కమిటీ ఏ క్షణంలోనైనా షర్మిలను పిలిపించి దీనిపై వివరణ కోరే అవకాశం కనిపిస్తోంది.అయినా తనపై చర్యలు తీసుకుంటే తన రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది అంటూ ఆమె చెబుతుండడం, తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి తమ పార్టీ వస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేస్తూ ఉండడం చూస్తుంటే … షర్మిలది కాన్ఫిడెన్స్, కాదని , ఓవర్ కాన్ఫిడెన్స్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube