చాలా మంది గుడ్లగూబల్ని చూడగానే అపశకునంగా భావిస్తారు.ఇక ఏదైనా శుభకార్యానికి బయల్దేరే క్రమంలో అది ఎదురుగా వచ్చిందంటే చాలు, ఏదో జరిగిపోతుంది, కీడు అన్నట్లు భయపడిపోతుంటారు.
మరికొంత మంది గుడ్లగూబను చూస్తేనే భయపడిపోతారు.కానీ.
, గుడ్లగూబ అనేది మానవాళికి ఎంతో మేలు చేస్తుంది.పంట పొలాల మీదక కీటకాలు, కొన్ని సందర్భాల్లో ఎలుకలు దాడి చేస్తుంటాయి.
వాటి దాడితో పంట నష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది.కానీ గుడ్లగూబ తన జీవితకాలంలో 11 వేల ఎలుకల్ని తింటుందంట.
తద్వారా 13 టన్నుల ఆహార పంటలను కాపాడుతుందని పరిశోధనలో తేలింది.
ఇలా మానవవాళికి ఎంతో మేలు చేసే ఈ గుడ్లగూబల్ని ప్రజలు కీడుగా భావించి వాటిని దూరం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం అడువుల శాతం అనేది పూర్తిగా తగ్గిపోతుంది.దీంతో అడువులలో ఎక్కువగా ఉండే ఈ గుడ్లగూబలు కూడా క్రమంగా కనుమరుగవుతున్నాయి.
ఇలాంటి క్రమంలో నల్లమల అడువులు, పాపికొండలలో అధికారులకు అరుదైన గుడ్లగూబలు దర్శనం ఇచ్చాయంట.అవి చూడటానికి గద్ద మాదిగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
చుక్కల పొట్ట , గద్దాకారం ఉన్న ఇవి రాష్ట్రంలో కనిపించడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు.ఇలాంటి అరుదైన గుడ్లగూబలు ఎక్కువగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎక్కువ దర్శనం ఇస్తాయంట.
కానీ ప్రస్తుతం వీటి ఉనికి లేకుండా పోతుంది.పట్టణ ప్రాతాల్లో పాత భవనాలల్లో గూడు కట్టుకునే వీటిని కొందరు మూఢనమ్మకాలతో లేకుండా చేస్తున్నారు.దీంతో రోజురోజుకు ఇవి కనుమరుగవుతున్నాయి.అంతే కాకుండా మన దేశంలో 16 రకాల గుడ్లగూబలు అక్రమ రవాణ చేస్తున్నారంట.ఇందులో కొన్నింటి క్షుద్రపూజల కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది.కానీ ఏది ఏమైనా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.
మూఢనమ్మకాలను వీడకుండా గుడ్లగూబల్ని లేకుండా చేయడం బాధాకరం అని చెప్పవచ్చు.