ప్రస్తుతం ఫోన్ వాడకం అనేది ఎక్కువవుతుంది.చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ వదలడం లేదు.
ఎక్కువగా చిన్న పిల్లల మీద సెల్ ఫోన్ ప్రభావం ఉంటుంది.వారు ఒక్క పూట అన్నం తినకపోయినా మంచిదే కానీ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు.
ఇలా ఫోన్ మాయలో పడి పిల్లల నుంచి యువకుల వరకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వార్తలు మనం చూస్తుంటాం.అంతే కాకుండా గేమ్స్ పబ్జీ, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ చిన్న పిల్లలను బానిసలుగా మార్చేశాయి.
వీటి మాయలో పడి ఎంతో మంది చిన్న పిల్లలు తమ ప్రాణాలు కోల్పోయారు.తాజాగా ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.రాష్ట్రంలోని చందా నగర్ పోలీస్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది.బతుకు దెరువు కోసమని ఓ కుటుంబం ఉత్తర్ ప్రదేశ్ లికితా పూర్ నుంచి మధ్య ప్రదేశ్ కు వచ్చారు.అక్కడే ఇటుక బట్టీల వ్యాపారం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.
అలా రెండు సంవత్సరాలుగా వారు మధ్య ప్రదేశ్ లోనే ఉంటున్నారు.రోజూ వారి పనిలో భాగంగా ఓ బాలుడి తల్లి దండ్రులు పనిలో నిమగ్నం అయ్యారు.
తమ ఇద్దరు కొడుకులు ఇటుక వద్ద కూర్చో బెట్టి, వారు పని చేసుకుంటున్నారు.ఈ క్రమంలో ఫ్రీ ఫైర్ ఆన్ లైన్ గేమ్‌కి బానిసైన పెద్దోడు, తన నాన్న మొబైల్ ఫోన్ తీసుకొచ్చుకొని, తమ్ముడిని తన వద్దే కూర్చో బెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు.
దీంతో ఇద్దరూ ఆటలో మునిగిపోయారు.ఈ క్రమంలో ఇటుకల నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ చిన్న త్రాచు పాము పెద్దోడిని కాటు వేసింది.
గేమ్‌లో మునిగిపోయిన వారు పామును గుర్తించలేకపోయారు.గేమ్ ఆడుతూనే ఉన్నారు.
దీంతో పరిస్థితి క్షీణించడంతో ఒక్కసారిగా బాలుడు కుప్ప కూలిపోయాడు.ఈ సంఘటనను గమనించిన ఇటుకల వ్యాపారం యజమాని, 108 వాహనానికి కాల్ చేసి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.
బాలుడు మరణించాడు.దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గేమ్‌కు బానిసై కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలుసుకున్న ఆ తల్లి రోదనలు మిన్నంటాయి.