లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడమే కాకుండా వాటిని వ్యూహాత్మకంగా పూర్తి చేస్తూ వస్తున్నాడు.ఏక కాలంలో రెండు సినిమాల షూటింగులు చేస్తూ యంగ్ హీరోల కన్నా బిజీ షెడ్యూల్స్ తో యాక్టివ్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.
ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.
మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు.ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ నిన్న హైదరాబాద్ లో స్టార్ట్ చేసినట్టు డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.
తాజాగా స్టార్ట్ అయినా షెడ్యూల్ లో రవితేజ, చిరుపై ముఖ్యమైన సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది.బాబీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.‘మెగాస్టార్ & మాస్ రాజా గారు తిరిగి మెగా 154 సెట్స్ లో అడుగు పెట్టారు.ఈ షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటూ సెట్ లోని ఒక ఫోటోను షేర్ చేసాడు.
![Telugu Chiranjeevi, Bobby, Massmaharaja, Ravi Teja, Shruthi Hasan-Movie Telugu Chiranjeevi, Bobby, Massmaharaja, Ravi Teja, Shruthi Hasan-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/09/Director-Bobby-shruthi-hasan.jpg )
ఇదిలా ఉండగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.