ఎవరైనా ఒక్కసారి హీరో అయ్యారంటే మళ్ళీ అంతకన్నా చిన్న పాత్రలు చేయడానికి ఒప్పుకోరు.చివరికి ఎంత ప్రాధాన్యత ఉన్న కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారమంటే కూడా సిద్ధంగా ఉండరు.
కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరో మాత్రం ఒకప్పుడు స్టార్ హీరోగా పని చేశారు.కానీ అవకాశాలు రాకపోవడంతో ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా మారారు.
ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? అతడు మరెవరో కాదు లాహిరి లాహిరి లాహిరిలో అంటూ తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఆదిత్య ఓం.
అవును.మీరు వింటున్నది నిజమే ఆదిత్య ఓం సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ప్రొడక్షన్ మేనేజర్ గా మారారు.వాస్తవానికి ఇతడు మన తెలుగు వాడు కాదు ఉత్తరాదిలో పుట్టాడు.
ఉత్తర ప్రదేశ్ లో పుట్టిన ఆదిత్య తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అయితే క్రమక్రమంగా అతనికి అవకాశాలు తగ్గిపోయాయి.
ఇక ఒకానొక టైంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో హిందీ సినిమా బాట పట్టి ముంబైలో ప్రొడక్షన్ మేనేజర్ గా అవతారం ఎత్తాడు.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు ఆదిత్య.

చివరికి వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాలు రాకపోవడంతో తాను ఈ పని చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.కెరియర్ తొలినాల్లలో ముంబైలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ఆ అనుభవంతో మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేయడం కుదిరింది అని చెప్పాడు.తన స్నేహితులు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు తాను గైడెన్స్ ఇచ్చే వాడిననీ, అలాగే డబ్బు కూడా వస్తుంది కాబట్టి నాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేయాల్సి రావడంతో ఇబ్బంది లేదు అంటూ చెప్పాడు.అలా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన ఒక సినిమా పేరు శూద్ర.
అది మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దానికి సీక్వెల్ కూడా వస్తుంది.ప్రస్తుతం దీంట్లో విలన్ గా కూడా నటిస్తున్నాడు ఆదిత్య.