తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాక్సింగ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.దాంట్లో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి లాంటి సినిమా ఘనవిజయం సాధించగా, గని వంటి చిత్రం మాత్రం పరాజయం పాలయింది.
మరోసారి బాక్సింగ్ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా విజయ్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకుడుగా పనిచేయగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమాని చార్మి, పూరి మరియు కరణ్ జోహార్ సహ నిర్మాతలుగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్లు పోస్టర్లు టీజర్లు రిలీజ్ అయి సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి.
అలాగే ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటించడంతో సినిమా స్థాయి మరింత పెరిగింది.అయితే సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా పూర్తిగా అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కినట్టు కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

కానీ ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందించాడు.ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ మీరు ఇప్పటివరకు చూసి ఉండరు అంటూ హింట్ కూడా ఇచ్చాడు.అయినా కూడా జోరు తగ్గడం లేదు.ఇక మరోవైపు ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది.ఇక ట్రైలర్లో రమ్యకృష్ణ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.అయితే రమ్యకృష్ణ పాత్రలో హీరోయిన్ రవీనా టాండన్ చేత నటింపచేయలని భావించాడట.
అయితే కథ చెప్పిన తర్వాత ఆమెకు నచ్చకపోవడంతో ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ ని ఎంచుకున్నారట.అలా ఒక ప్రాధాన్యత ఉన్న పాత్ర ను రవినా మిస్ చేసుకుందనే చెప్పుకోవాలి.
ఇటివలే కేజిఎఫ్ టూ లో నటించిన రవినా ని మళ్లీ అంతటి పవర్ఫుల్ రోల్ లో చూసే అవకాశం ప్రేక్షకులకు కూడా మిస్ అయ్యింది.







