చిన్న చిత్రం గా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఈ మధ్య కాలం లో నిలిచిపోయే సినిమా డీజే టిల్లు.ఈ సినిమా లో సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించిన విషయం తెలిసిందే.
ఆయన యాక్టింగ్ కి జనాలు ఏ స్థాయి లో ఫిదా అయ్యారో తెల్సిందే.ఆయన డైలాగ్ డెలివరీ తో పాటు హీరోయిన్ తో చేసిన ఫన్నీ సన్నివేశాలకు మరియు ఇతర కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల ఫిదా అయిన నేపథ్యం లో ప్రస్తుతం డీజే టిల్లు సినిమా కు సంబంధించిన సీక్వెల్ రూపొందే పనిలో ఉన్నారు.
హీరో గా సిద్ధు జొన్నలగడ్డ కంటిన్యూ అవబోతున్నాడు.హీరోయిన్ విషయం లో గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మొదటి పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.రాధిక రాధిక అంటూ హీరోయిన్ స్థాయిని అమాంతం పెంచేసిన హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం హీరోయిన్ విషయం లో విభిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
డీజే టిల్లు 2 సినిమా లో రాధిక పాత్ర ను విలన్ గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.మొదటి నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయి గా చూపించారు.
అది కాస్త రెండో పాటు మరింత నెగటివ్ షేడ్స్ తో ఉన్న అమ్మాయి గా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరో వైపు ఈ సినిమా లో ఇంకో హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం అందుతోంది.
ఆ హీరోయిన్ ఎవరనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఇటీవలే షూటింగ్ ప్రారంభించాలని భావించినా కూడా టాలీవుడ్ లో నిర్మాత ల సమ్మె కారణం గా షూటింగ్ నిలిచిపోయింది.త్వరలోనే డీజే టిల్లు 2 సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ సినిమా కు దర్శకుడు ఎవరనేది త్వరలో ప్రారంభిస్తామని సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు తెలియజేశారు.