ఏపీని శ్రీలంక లిస్ట్ లో చేర్చిన కేంద్రం ! టీడీపీ వైసీపీ మధ్య రచ్చ రచ్చ 

ఏపీలో మరో రాజకీయ రచ్చ మొదలు కాబోతోంది. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న తప్పిదం బయటపడిన దానిని హైలెట్ చేసి రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కాచుకొని కూర్చుంటుంది.

 The Center Included Ap In The List Of Sri Lanka Tdp Ycp Tussle Tdp, Ysrcp, Ap,-TeluguStop.com

అయితే ఈసారి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా కేంద్రమే ఒక నివేదికను బయట పెట్టడం టిడిపికి ఎక్కడలేని ఆనందం కలిగిస్తోంది.గత కొంతకాలంగా ఈ శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఆ దేశం పూర్తిగా సంక్షోభంలో కూలిపోయింది.

ఇప్పట్లో శ్రీలంక కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు.దీంతో ఆదేశ ఆర్థిక పరిస్థితులను ప్రస్తావిస్తూ ఏపీలోనూ శ్రీలంక పరిస్థితి రాబోతోందని జనసేన టిడిపి వంటి పార్టీ గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వస్తున్నాయి.

       ఈ క్రమంలోని తాజాగా కేంద్రం శ్రీలంకలోని సంక్షోభ పరిస్థితులను వివరిస్తూ, ఏపీతో సహా 11 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ప్రస్తావించింది.ఈ లిస్టులో ఏపీ తెలంగాణలు కూడా ఉండడంతో వైసిపి , టిఆర్ఎస్ ప్రభుత్వాలపై రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధం దొరికినట్టు అయింది.

అయితే కేంద్రం ఏపీ గురించి ఈ విధంగా ప్రస్తావించడం, శ్రీలంక పైన చర్చ జరిగే సమయంలో ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి వివరించడంపై వైసిపి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.ఏపీలో రుణ పరిమితి మేరకే తాము అప్పులు తీసుకున్నామని వైసిపి ప్రభుత్వం చెబుతోంది.

కానీ ఇప్పుడు దీనిని టిడిపి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతోంది.అఖిలపక్ష సమావేశంలో టిడిపి నుంచి హాజరైన రాజ్యసభ సభ్యుడు కనకమేడల ఆర్థిక క్రమశిక్షణ పాటించని రాష్ట్రాల పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.     

Telugu Ap, Jagan, Srilanka, Tdp Ysrcp, Telugudesam, Ysrcp-Politics

  అలాగే పోలవరం విషయంలోనూ కేంద్రం ఇదేవిధంగా వ్యవహరించింది.ప్రాజెక్టు నిర్మాణానికి వ్యూహం లేదని , కాంట్రాక్టు నిర్వహణ సరిగా లేదంటూ కేంద్రం బయటపెట్టింది .2022 లో కూడా ప్రాజెక్టు పూర్తి కాదని కేంద్రం చెప్పుకొచ్చింది దీనిపైన టిడిపి వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.ఈ వ్యవహారం పైనే జనాల్లోకి వైసిపి ప్రభుత్వాన్ని మరింత అభాసు పాలు చేసే విధంగా టిడిపి ప్రయత్నాలు చేస్తుండగా వైసిపి దీనికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.పార్లమెంట్ వేదికగా కేంద్రం గతంలో టిడిపి ప్రభుత్వం ఉండగా 1.62 లక్షల కోట్లు వివరాలు ఇవ్వలేదని చెప్పిన అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని వైసిపి ప్లాన్ చేసుకుంది.కాగ్ దీనికి సంబంధించిన లెక్కలు చెప్పాలని అడిగినా, 51 వేల కోట్ల రూపాయలకు మాత్రమే లెక్కలు చెప్పారని , మిగిలిన 1.51 లక్షల కోట్ల సంగతి తేలాల్సి ఉందని కేంద్రం స్పష్టం చేసింది.దీనిపైన టిడిపి ని ఇరుకున పెట్టే విధంగా వైసిపి వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube