మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ట్రిపుల్ ఆర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వెంటనే తర్వాత సినిమా స్టార్ట్ చేసాడు.రామ్ చరణ్ హిట్ కొట్టిన జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.
మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీమ్ అంతా సిద్ధం అవుతున్నారు.
అమృత్ సర్ లో ఒక షెడ్యూల్, ఆపై వైజాగ్ లో మరొక షెడ్యూల్ ముగించిన తర్వాత ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం శంకర్ రెడీగా ఉన్నాడు.
మరి ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని శంకర్ కూడా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అలాగే రామ్ చరణ్ లుక్ లో కూడా విభిన్నంగా చూపించ నున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్న లుక్ లలో కనిపించ నున్నట్టు టాక్.
ఇప్పటికే చరణ్ లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ ఐయ్యాయి.
వారాల వ్యవధిలోనే చెర్రీ తన లుక్స్ మార్చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాడు.ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఒక స్పెషల్ ఉండనుందని.ఈ సాంగ్ లో జాక్వెలిన్ ఫెర్నాండజ్ నర్తించ బోతుంది అని టాక్ వినిపిస్తుంది.అయితే ఈ సాంగ్ గురించి లేటెస్ట్ గా ఒక సమాచారం అందుతుంది.
ఈ స్పెషల్ సాంగ్ లో పొలిటికల్ టచ్ ఉండబోతుందట.పొలిటీషియన్స్ పై సెటైరికల్ గా ఈ సాంగ్ ను ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.పొలిటికల్ టచ్ అంటే ఒక్కోసారి ఒక్కోసారి వివాదం కూడా అవుతుంది.
మరి శంకర్ ఈ సాంగ్ ను ఎలా ప్లాన్ చేసాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా.
దిల్ రాజు భారీ బడ్జెట్ తో న నిర్మిస్తున్నారు.