ఇకపై కృష్ణతో సినిమాలు తీయకూడదు అని శోభన్ బాబు ఎందుకు నిర్ణయించుకున్నాడు

టాలీవుడ్ లో నిన్నటి తరం హీరోలలో అగ్ర హీరోలుగా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఒక వెలుగు వెలిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఇరువురు కూడా కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించారు అయితే ఇప్పటి ప్రేక్షకులకు తెలియని విషయం ఏంటంటే వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారని.

 Sobhan Babu Multistarrer Movies With Krishna Sobhan Babu, Super Star Krishna , T-TeluguStop.com

ఎందుకంటే వీరిద్దరూ కలిసి అనేక మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు.ఇప్పటి రోజుల్లో ఏ ఇద్దరు హీరోలు కలిసి సినిమా తీయాలన్నా కూడా అది అత్యంత పెద్ద విషయంగా పరిగణిస్తున్నారు.

కానీ అప్పటి రోజులు అలా ఉండేవి కాదు.దర్శకుడు, నిర్మాత నిర్ణయిస్తే ఎలాంటి హీరో అయినా కూడా నటించాల్సిందే.

దాంతో వీరిద్దరికున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అప్పటి సినిమా దర్శక నిర్మాతలు వీరిద్దరిని కలిపి మల్టీ స్టారర్ సినిమాలు తీయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు.అంతేకాదు ఏకంగా వీరిద్దరి కాంబినేషన్లో కృష్ణార్జునులు, దొంగలు, మహాసంగ్రామం, ముందడుగు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 మల్టీ మల్టీస్టారర్ సినిమాలు తీసారంటే అది మామూలు విషయం కాదు.

అలా వీరిద్దరి కాంబినేషన్ కొన్నేళ్లపాటు కొనసాగింది అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మహాసంగ్రామం సినిమా మల్టీస్టారర్ గా చివరి సినిమా కావడం విశేషం.దీని వెనకాల చాలా పెద్ద కథ ఉందట.

వివరాల్లోకి వెళ్తే, మహాసంగ్రామం సినిమా తర్వాత శోభన్ బాబు ఇకపై కృష్ణతో సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నారట.దానికి గల కారణం మహాసంగ్రామం సినిమాలోని తన సీన్స్ అన్నీ కూడా కట్ చేయడం, దాంతో ఆయన నిడివి సినిమాలో తక్కువగా ఉండడం శోభన్ బాబుకి నచ్చలేదట.

అంతేకాదు కొంతమంది అభిమానులు ఏకంగా శోభన్ బాబు ఇంటికి వెళ్లి మరి మీ సీన్స్ ఇలా తక్కువగా ఉండడం వల్ల గెస్ట్అపీరియన్స్ లా మారిపోయిందంటూ మాకు అసలు ఇలా చేయడం నచ్చలేదంటూ శోభన్ బాబుకే అల్టిమేటం ఇచ్చారట.దాంతో ఇకపై ఇలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట శోభన్ బాబు.

Telugu Dongalu, Jaya Sudha, Krishna, Krishnarjuna, Mahasangrammam, Mundadugu, So

అయితే శోభన్ బాబు సన్నివేశాలు కట్ అవ్వడానికి మరొక కారణం ఉందట.మొదట శోభన్ బాబుకు సంబంధించిన అన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత కృష్ణకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారట.కానీ సినిమా అవుట్ పుట్ విషయానికి వచ్చేసరికి కొన్ని సన్నివేశాలకు సంబంధం లేకపోవడంతో ఎక్కువగా శోభన్ బాబుకు సంబంధించిన సన్నివేశాలను కట్ చేయాల్సి వచ్చింది అంట ఎడిటింగ్ లో.దీంతో సినిమాలో శోభన్ బాబు పాత్ర నిడివి తగ్గిపోయింది.ఏది ఏమైనా మహాసంగ్రామం సినిమా తర్వాత పూర్తిగా మల్టీస్టారర్ సినిమాలకు స్వస్తి పలికారు శోభన్ బాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube