బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 45 సినిమాలలో నటించింది.ఆ తర్వాత కథానాయకిగా మారి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను సంపాదించుకుంది.
హీరోయిన్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం అభినయంతో ఆకట్టుకుంది.ఇప్పుడు కాస్త లేటు వయసులో కూడా సీనియర్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు మీనా.తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.అయితే ఇటీవలే మీనా ఇంట్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.మీనా భర్త ఇటీవలే హఠాత్ మరణం చెందారు.
2009లో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న విద్యాసాగర్ కి ఇచ్చి మీనా పెళ్లి చేశారు ఆమె పేరెంట్స్.అయితే ఇక పెళ్లి అయిన నాటి నుంచి వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా సాగిపోయింది వీరి దాంపత్య జీవితం.
వీరి బంధానికి గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది.కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్ ఇక ఇటీవల ఆరోగ్యం విషమించి చివరికి హఠాత్ మరణం చెందారు.
అయితే ప్రస్తుతం మీనా భర్త విద్యాసాగర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి అయిన విద్యాసాగర్ ఎన్నో కష్టాలు పడి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడట.
మీనా తో పెళ్లి జరిగినప్పుడు ఆయన నెలకు రెండు లక్షలు సంపాదిస్తూ ఉండే వారట.
ఇక మీనా తో వివాహం తర్వాత ఆయన దాదాపు ఏడు దేశాలలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారట.బెంగుళూరు ల్ విద్యాసాగర్ కి చాలానే స్థిరాస్తులు ఉన్నాయట.దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులు.
ఆయన పేరిట ఉన్నాయట.దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.
అంతేకాకుండా గత కొన్ని రోజుల నుంచి మీనా విద్యాసాగర్ మధ్య విభేదాలు ఉన్నాయన్నది కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.రూమర్స్ పై స్పందించిన మీనా బాధలో ఉన్న మమ్మల్ని మరింత బాధ పెట్టకండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.