తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వల్ల దాదాపు 2 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది.పనులు ఆలస్యం కావడం, డిజైన్లు మార్చడం వల్ల కొత్త భవనాల నిర్మాణం లేటవుతోంది.
దీంతో ఖర్చు అంచనాలు బాగా పెరుగుతున్నాయి.కొత్త సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి విపరీతంగా ఖర్చు పెరుగుతోంది.
వరంగల్ ఆస్పత్రి, హైదరాబాద్ లో నిర్మించాలనుకున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభం కాకముందే ఖర్చు అంచనాలు 150 కోట్లు పెరిగింది.ఇక సెక్రటేరియట్ భవనాల నిర్మాణ ఖర్చు 400 కోట్ల నుంచి 1100 కోట్లకు చేరుకుంటోంది.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ ఖర్చు 400 కోట్ల నుంచి 700 కోట్లకు చేరింది.పనులు ఆలస్యం కావడం, డిజైన్లు పదే పదే మార్చడం వంటి కారణాలతో ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది.
ఇక్కడ చెప్పుకున్న అరడజను భవనాలకే దాదాపు 2 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.కాని దీనికి వెనుక వేరే కథ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ ఆస్పత్రులు, సెక్రటేరియట్ నిర్మాణాల వెనుక భారీ అవనీతి చోటు చేసుకుంటుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.అందుకే ఖర్చు అంచనాలను ఇష్టం వచ్చినట్లుగా పెంచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సర్కారు తీరుతో భవన నిర్మాణాల ఖర్చు పెరుగుతున్నాయి.ప్రజా ధనం మొత్తం కాంట్రాక్టర్ల పాలవుతున్నాయి.
పనుల ఆలస్యం, డిజైన్ల మార్పులతో ఖర్చులు పెరుగుతున్నాయి.కొత్త భవనాలకు 2 వేల కోట్ల వరకు అదనపు ఖర్చు?.అమరవీరుల స్థూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త సెక్రటేరియట్.భవనాల నిర్మాణాలకు అంచనాలు భారీగా పెరిగాయి.

1100 కోట్ల నుంచి 1250 కోట్ల వరకు వరంగల్ ఆస్పత్రి నిర్మాణ పనుల ఖర్చు చేరింది.హైదరాబాద్ లోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు 2 వేల ఆరు వందల 79 కోట్ల నుంచి 3 వేల రెండు వందల కోట్లకు అంచనాలు పెరిగింది.కొత్త సెక్రటేరియట్ డిజైన్ల మార్పు, పనుల ఆలస్యంతో నాలుగు వందల కోట్ల నుంచి పదకోండు వందల కోట్లకు అంచనాలు చేరాయి.
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు 2015లో శంకుస్థాపన చేశారు.మూడు వందల కోట్లు అనుకున్న సెంటర్ నిర్మాణానికి ఏడు వందల కోట్లు ఖర్చు అయింది.తెలంగాణ అమరవీరుల స్థూపం ఖర్చు అంచనాలు ఎనభై కోట్ల నుంచి 177 కోట్ల రూపాయిలకు చేరింది.