ఆ టీడీపీ ఎమ్మెల్యే లకు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్న జగన్ ?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్నికల సందడి కనిపిస్తోంది.సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా .

 Jagan Confirming Tickets For Those Tdp Mlas , Vallabaneni Vamsi, Jagan, Ap Cm, K-TeluguStop.com

ఇప్పటి నుంచే ఆ హడావుడి మొదలైపోయింది.పార్టీ శ్రేణులు అంతా నిత్యం జనం లోనే ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి జగన్ ప్రభుత్వం చేస్తున్న మేలు గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించి, జనాల్లోకి పార్టీ శ్రేణులు వెళ్లేలా జగన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు.

అంతేకాదు రాబోయే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలనే విషయం పైన జగన్ దృష్టి పెట్టారు.ముఖ్యంగా టిడిపి నుంచి గెలిచి వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్న ఎమ్మెల్యేల విషయంలోను జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట.

వారు నేరుగా వైసీపీలో చేరకపోయినా,అనుబంధంగా కొనసాగుతున్నారు.

Telugu Ap Cm, Ap Cm Jagan, Jagan, Karanam Balaram, Krishnamohan, Maddala Giri, V

అయితే వారి రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వైసిపి నాయకులు కొంతమంది నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ ఉండడం, టిడిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే లకు తగిన సహకారం అందించకపోగా, వారిని పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడం తదితర కారణాలతో తరుచుగా నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి.ఈ విషయంపై ఎన్నిసార్లు పంచాయతీలు నిర్వహించినా.పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు.

ఈ వ్యవహారాలతో విసిగిపోయిన జగన్ టీడీపీ నుంచి వచ్చి వైసీపీతో ఉంటున్న ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.వారిలో కొంతమందికి టికెట్ కన్ఫామ్ చేయాలని డిసైడ్ అయిపోయారట.

గన్నవరం వైసిపి టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి 2024లో టిక్కెట్ ఇవ్వబోతున్నట్లు ముందుగానే ప్రకటన చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.గన్నవరం లో వైసిపి సీనియర్ లీడర్ దుట్టా రామచందర్ రావు, 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున వంశీ పై పోటీ చేసి ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు, వంశి వర్గాల మధ్య ఏమాత్రం సఖ్యత లేకపోవడం, తరచుగా వివాదాలకు జరుగుతుండడంతో వంశీ కి టికెట్ కన్ఫామ్ చేయాలని, ఈ వివాదాలకు పులిస్టాప్ పెట్టాలని తన నిర్ణయాన్ని ఆమోదించిన వారే పార్టీలో ఉంటారని, లేకపోతే వారి దారి వారు చూసుకుంటారనే నిర్ణయానికి జగన్ వచ్చారట.

Telugu Ap Cm, Ap Cm Jagan, Jagan, Karanam Balaram, Krishnamohan, Maddala Giri, V

అంతేకాదు విశాఖ సౌత్ టిడిపి నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు.ఆయనను స్థానిక వైసిపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.దీంతో అక్కడ తరచుగా విభేదాలు తలెత్తుతూ ఉండడంతో, వాసుపల్లి గణేష్ కుమార్ కు వైసీపీ టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారట.వీరే కాకుండా ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరాం వైసిపి కి అనుబంధంగా కొనసాగుతున్నారు.

అక్కడ ఆమంచి కృష్ణమోహన్ వర్గంతో బలరాంకు విభేదాలు ఉండడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని బలరామ్ కు కేటాయించాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించుకుందట.ఇక గుంటూరు జిల్లా కు చెందిన మద్దాల గిరి కి టికెట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఈ విధంగా తనను నమ్మి టీడీపీ నుంచి వైసీపీ కి అనుబంధం గా కొనసాగుతున్న వారందరికీ టికెట్ ఇవ్వబోతున్న విషయాన్ని పార్టీ ప్లీనరీలో ప్రకటించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube