టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు.ఈయన ఇప్పటి వరకు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు.అందుకే ఈయనను విలక్షణ నటుడు అంటూ ఉంటారు.అలాగే మంచు హీరోల్లో ఒకరైన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లు ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచారు.
వీరిద్దరికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.
వీరిద్దరూ మా అధ్యక్ష పదవికి పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఎలెక్షన్స్ సమయంలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూ ఎప్పుడు లేనంత రసవత్తరంగా ఈ ఎన్నికలను మార్చేశారు.గత ఏడాది మా ఎలెక్షన్స్ జరిగాయి.
హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే.అయితే ఎన్నికల ముందు ఎలా అయితే ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అలానే చాలా రోజుల పాటు వార్ జరిగింది.
ఇలా వార్ ముగిసిన తర్వాత ఇదే మొదటిసారి వీరిద్దరూ ఒకే చోట కలవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.వీరు కలవడానికి ఒక కారణం ఉంది.యువ నటుడు విశ్వక్ సేన్ తన 11వ సినిమాను ఈ రోజు లాంఛనంగా స్టార్ట్ చేసాడు.ఈ సినిమాను ప్రముఖ నటుడు డైరెక్టర్ అయినా అర్జున్ సర్జా దర్శకత్వం వహించ నున్నాడు.

ఈ రోజు ఈ సినిమాను గ్రాండ్ గా చేసారు.అయితే ఈ లాంచింగ్ వేడుకకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా హాజరయ్యారు.ఈ ఫోటోలు అన్ని కూడా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.ఈ ఫొటోల్లో ఒక ఫొటోలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.
ఇలా పాత గొడవలు మర్చిపోయి మరీ వీరిద్దరూ ఏదో విషయంపై మాట్లాడు కుంటున్నట్టుగా అనిపిస్తుంది.మరి నిజంగానే పాత గొడవలు మర్చిపోయారా లేదంటే కలిశారు కాబట్టి మాట్లాడు కుంటున్నారో తెలియదు.