తెలంగాణ‌లో నేత‌ల‌ హ‌డావుడి.. అంతా 'ముంద‌స్తు' ప్లాన్ కోస‌మేనా..

తెలంగాణ జిల్లాల్లో ‘ముంద‌స్తు’ హ‌డావుడి క‌నిపిస్తోంది.అప్పుడే ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయా అన్న‌ట్లు నేత‌లు గ్రామాల్లో సంద‌డి చేస్తున్నారు.

 Telangana Political Parties Are Making Arrangements For Early Elections By Going-TeluguStop.com

టీఆర్ఎస్ తో స‌హా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి.ప్ర‌తిప‌క్షాలు అయితే ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ వాలిపోతున్నాయి.

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రెగ్యూల‌ర్ గా ప‌లు కార్య‌క్ర‌మాల పేరిట‌ జ‌నంతో మ‌మేక‌మ‌వుతున్నాయి.ఒక హైద‌రాబాద్ మిన‌హా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఇదంతా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉండ‌టంతోనే జ‌రుగుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఈ నేప‌థ్య‌లోనే టీఆర్ఎస్ నేత‌లు మ‌రింత జోరుపెంచారు.

త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో విసృతంగా ప‌ర్య‌టిస్తున్నారు.ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ ప్ర‌జ‌ల్ని ప్ర‌స‌న్నం చేసుకుంటున్నారు.

దీంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొంటూ సంద‌డి చేస్తున్నారు.మంత్రులు కేటీ ఆర్, నిరంజ‌న్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇంద్రకర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు.

అలాగే టీ కాంగ్రెస్ నేత‌లు కూడా గ్రామాల్లో రచ్చబండ నిర్వహిస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిత్యం ప్ర‌జాస‌మ‌స్య‌ల్లో పాల్గొంటూ ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు తెలుపుతున్నారు.

Telugu Bandi Sanjay, Congress, Etela, Ministers, Mlas, Raghunandan, Revanth Redd

ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ వాలిపోతున్నారు.కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను కూడా ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ఉన్నారు.ఇక క‌మ‌ల‌నాథులు కూడా తెలంగాణ‌లో దూకుడు పెంచారు.గ‌తంలో కంటే బీజేపీ రాష్ట్రంలో బ‌ల‌ప‌డుతోంద‌నేది వాస్త‌వం.ఇక స్టేట్ చీఫ్ బండి, ర‌ఘునంద‌న్, ఈట‌ల వంటి నేత‌లు ప్ర‌జ‌ల్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచక పాలన ఉంద‌ని కుటుంబ పాల‌న‌కు ముగింపు ప‌ల‌కాల‌ని చెబుతున్నారు.

అలాగే ప‌లు జిల్లాల్లో ఏ ప‌దవి లేని నేత‌లు కూడా పార్టీల త‌ర‌ఫున‌.మ‌రికొంద‌రు ప‌లుకుబ‌డి ఉండి స్వ‌త‌హాగా పోటీచేయాల‌నే నేత‌లు కూడా గ్రామాల్లో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube