ఎస్కలేటర్‌పై పల్టీలు కొట్టిన ప్రేమజంట

ఇటీవల కాలంలో ప్రేమ జంటల తీరుతో పలువురు ఇబ్బంది పడుతున్నారు.పార్కులు, సినిమా హాళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.

 A Couple Flipping Over An Escalator, Escalater, Lovers, Fall Down, Viral Latest-TeluguStop.com

తమను చుట్టుపక్కల వాళ్లు చూస్తారనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు.ఇటువంటి తీరు విదేశాల్లో కనిపిస్తుంది.

అయితే ఫ్యాషన్ పోకడలతో విదేశీయులను అనుకరిస్తూ మన దేశంలోనూ పలు చోట్లు ఇటువంటివి కనిపిస్తున్నాయి.ఇలాగే ఓ ప్రేమ జంట ఓ షాపింగ్ మాల్‌లోని ఎస్కలేటర్‌పై హద్దులు మీరి ప్రవర్తించింది.

ఎవరైనా చూస్తారనే భయం లేకుండా ఏకంగా ఎస్కలేటర్‌పై ముద్దుల్లో మునిగిపోయారు.అంతలోనే వారికి ఊహించని షాక్ తగిలింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర కథనమిలా ఉంది.

ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ అయిన ఓ వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.

ప్రేమ మైకంలో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన జంటకు షాక్ తగిలింది.ఎస్కలేటర్‌ ఎక్కుతూ ప్రేమలో మునిగి తేలిన ఆ జంట ముద్దు పెట్టుకుంది.

కనీసం పడిపోతామని, చుట్టూ ఎవరైనా చూస్తే బాగోదని భావించ లేదు.తమ పనిలో తాము మునిగిపోయారు.

అయితే క్షణాల్లోనే వారు పల్టీలు కొడుతూ ఎస్కలేటర్ పై నుంచి కిందికి పడిపోయారు.దెబ్బలు తగలడంతో తమ చేతులు కాళ్లు చూసుకుని బాధ పడ్డారు.

చుట్టూ ఎవరైనా చూశారని తల తిప్పి, ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

ఎక్కడిపడితే అక్కడ ఇలా చిల్లర ప్రవర్తన చేస్తే ఇలాగే ఎదురవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆ జంట ఇక బహిరంగంగా ముద్దు పెట్టుకోదని ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube