నటిగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నమ్రత ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈమె ఒక మంచి భార్యగా మంచి తల్లిగా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే మహేష్ బాబు పౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎంతో మందికి ఎన్నో రకాల సేవలను అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ అందించిన ఘనత మహేష్ బాబు దంపతులకు చెందుతుంది.
ఇకపోతే తాజాగా అనాధ బాలబాలికలకు నమ్రత మరొక సహాయం చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.
నమ్రత మహిళలకు సంబంధించిన సేవా కార్యక్రమాలను చేయడం కోసం ముందు వరుసలో ఉంటారు.ఈ క్రమంలోనే అనాధలుగా ఉన్నటువంటి బాలికల కోసం ఈమె నంద్యాలలో BIRDS NGO నుండి స్వతంత్ర ఒంటరి తల్లులు చేతితో తయారు చేసిన న్యాప్‌కిన్‌లను అనాధాశ్రమంలో ఉన్న బాలికలకు అందించారు.

నెలసరి సమయంలో మహిళలు పడే ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని నమ్రతా అనాధ బాలికల కోసం ఈ సహాయ కార్యక్రమాలను చేపట్టారు.ఈ క్రమంలోనే నమ్రత అనాధ బాలికలతో కలిసి వారికి న్యాప్‌కిన్‌లను అందిస్తూ వారితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇలా ఒక మహిళ బాలికల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వారికి సహాయం చేయడానికి ముందుకు రావడంతో నమ్రత పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.