యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కోసం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు ప్రశాంత్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు.
అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా ఎంపిక చేస్తే బాగుంటుందని కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల్లో శ్రీనిధి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఫ్యాన్స్ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ కు జోడీగా శ్రీనిధి శెట్టిని ప్రశాంత్ నీల్ ఎంపిక చేస్తారేమో చూడాలి.మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీనిధి శెట్టి ప్రస్తుతం కోబ్రా మూవీలో విక్రమ్ కు జోడీగా నటిస్తున్నారు.
ఆగష్టు 11వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి పేరు కంటే డబ్బే ముఖ్యమని కామెంట్లు చేశారు.
అయితే శ్రీనిధి చేసిన కామెంట్లు కొంతమందికి నచ్చకపోవడంతో ఆమెను సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేశారు.

కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా శ్రీనిధి శెట్టికి గుర్తింపు దక్కింది.ఎన్టీఆర్ కు జోడీగా ఛాన్స్ దక్కి సినిమా సక్సెస్ సాధిస్తే శ్రీనిధి శెట్టి క్రేజ్ కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.2023 ఏప్రిల్ నెల నుంచి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుకానుంది.