ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ప్రతిష్ఠాత్మకమైన పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ ఐపాడ్ (iPod) తయారీని నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.దీంతో యాపిల్ ఇకపై ఐపాడ్‌లను తయారు చేయదని మ్యూజిక్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే యాపిల్ స్టోర్‌లో స్టాక్ ఉన్న ఐపాడ్‌లను కొనుగోలు చేసుకోవచ్చు.అక్టోబర్ 23న, 2001లో, స్టీవ్ జాబ్స్ ఐపాడ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు.
అంటే దాదాపు 21 ఏళ్ల సంవత్సరాల పాటు ఈ మ్యూజిక్ ప్లేయర్ ప్రపంచవ్యాప్తంగా సంగీత శ్రోతలను అందుబాటులో ఉంది.అయితే ఇకపై ఈ మ్యూజిక్ ప్లేయర్ నుంచి కొత్త వెర్షన్లు రావు.
చిట్ట చివరి వెర్షన్ ఐపాడ్ టచ్ తయారీ నిలిపివేయడంతో మ్యూజిక్ ప్రియులు సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతున్నారు.
వాక్‌మెన్, రేడియో, కంప్యూటర్లలో మాత్రమే సంగీతం వినడం సాధ్యమైన కాలంలో ఐపాడ్‌ను స్టీవ్ జాబ్స్ పరిచయం చేశారు.
ఐపాడ్ లో 1,000 పాటలు వ వినవచ్చని ఆయన దీనిని లాంచ్ చేశారు.దీంతో సంగీత ఫ్రీ లో దీనిని విపరీతంగా కొనేశారు.
అయితే ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి.

ఆ మొబైల్ ఫోన్స్ లో అన్ని రకాల మ్యూజిక్ ప్లేయర్లు లభిస్తున్నాయి.దీంతో ప్రత్యేకంగా మ్యూజిక్ వినడం కోసం ఐపాడ్ కొనుగోలు చేసే యూజర్ల సంఖ్య భారీగా తగ్గింది.ఈ కారణంగానే ఈ మ్యూజిక్ ప్లేయర్ ఉత్పత్తుల తయారీని ఆపేస్తున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది.2014 నుంచి ఐపాడ్ తయారీని యాపిల్ తగ్గిస్తూ వస్తోంది.2017 లో ఐపాడ్ నానో, ఐపాడ్ షఫీల్ అనే రెండు మోడల్స్ ను తయారు చేయడం నిలిపివేసింది.ఇప్పుడు ఐపాడ్ తయారీని పూర్తిగా ఆపేసింది.