బొంగులో చికెన్‌ కాదు గాని, బొంగులో కల్లు గురించి చెబుతా వినండి!

బొంగులో చికెన్‌ అనేది పాత ట్రెండు.ఇపుడు బొంగులో కల్లు అనేది కొత్త మాట.

 Palm Wine In Bamboo Has Become New Trend In Telangana Details, Bongu Chicken,-TeluguStop.com

ఎందుకంటే ఇది దాదాపు ఓ 3, 4 సంవత్సరాలనుండి అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది.బేసిగ్గా కల్లు సేకరించడానికి మట్టి ముంతలను తాటిచెట్లకు వేలాడతీయడం సాధారణ పద్ధతి.

కానీ అక్కడ దీనికి భిన్నంగా ఇక్కడ వెదురు బొంగులను వాడుతున్నారు.చెట్లకు ముంతల స్థానంలో బొంగులు కట్టి కల్లు పడుతున్నారు.

అవును.తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహదేవపురం, కమలాపురం అనే గ్రామాలను మనం ఛత్తీస్‌‌గఢ్ సరిహద్దుల్లో చూడవచ్చును.

ఇక్కడ వేసవిలో తాటి కల్లు కొత్త రుచిలో దొరకడంతో కల్లు బాబులు ఈ గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు.

ఒక్కో బొంగులో 2 నుండి 3 లీటర్ల కల్లు పడుతుంది.

వెదురు బొంగుల్లోని కల్లు త్వరగా పులిసిపోవడం లేదని, సహజమైన రుచి ఎక్కువ రోజులు ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు.కొంతమంది పేషేంట్లు కూడా ఈ కళ్ళు తాగడం మనం ఇక్కడ చూడవచ్చు.

చెన్నైలో పనిచేసే ఓ లెక్చరర్‌ కి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని డాక్డర్లు చెప్పారు.దానికి అతగాడు చికిత్స తీసుకున్నా పెద్దగా ఫలితం లేక, ఎవరో చెప్పగా ఈ కళ్ళు బాట పట్టాడు.

అంతే, దాదాపు 6 నెలల లోపే కిడ్నీలో రాళ్లన్నీ కరిగిపోయాయి. ఇక అతడు కేవలం కల్లు కోసమే చెన్నైలో ఉద్యోగం మానేసి, సొంతూరు పరకాల (వరంగల్ రూరల్ జిల్లా)లో వ్యవసాయం చేసుకుంటూ సెటిల్‌ అయిపోవడం కొసమెరుపు.

Telugu Bongu Chicken, Bongu Kallu, Bongukallu, Kidneydiseases, Telangana, Latest

అయితే ‘వెదురు బొంగులో పట్టిన కల్లులో కిడ్నీ వ్యాధులను తగ్గించే లక్షణాలు ఉన్నాయా?’ అని పలువురు సైంటిస్టులను సంప్రదించగా, మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ భూక్యా భీమా అనే అతను దీన్ని ఋజువు చేసాడు.తాటి చెట్టు నుండి తాజాగా తీసిన కల్లు తాగితే.అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మనిషి కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందని, దీంతో పాటు కిడ్నీ వ్యాధికారక సూక్ష్మజీవులను కూడా ఈ జీవి నాశనం చేస్తుందని గుర్తించినట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం సూక్ష్మజీవశాస్త్రం విభాగం ప్రొఫెసర్‌ భూక్యా భీమా తెలిపారు.ఈయన గతంలో తన టీమ్‌తో ఏడాది పాటు ఖమ్మం, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో 50 రకాల తాటి కల్లు నమూనాలు సేకరించి పరిశోధన చేశారు.

ఫలితంగా 18 రకాల సూక్ష్మజీవులు మనిషిలోని రోగకారక సూక్ష్మజీవులను చంపుతున్నట్టు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ద్రువీకరించిందని భూక్యా భీమా చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube