సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలను మనం చూస్తూనే ఉంటాము.మరి ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలను అయితే నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు.
అవి చేసే పనులు చూస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది.అయితే మనలో జంతు ప్రేమికులు చాలా మందినే ఉన్నారు.అలాంటివారు తప్పకుండా ఈ వీడియో చూడాలిసిందే.బయట చలికి వణికిపోతున్న ఒక చిన్న పిల్లిపిల్లను చూసి ఒక చిన్నారి మనస్సు ఎంతగానో పరితపించిపోయింది.
ఆ పిల్లిని చుసి భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి దానిని దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమతో ముద్దాడింది. ఈ క్యూట్ అండ్ లవ్లీ వీడియోను చూసిన ప్రతి ఒక్క నేటిజన్ కూడా లైక్ చేయకుండా ఉండలేకపోతున్నారు.
సాధారణంగా చిన్న పిల్లలకు ఏమి తెలియదు.జంతువులను చూసి అవి హాని చేస్తాయా లేక మేలు చేస్తాయా అనే విషయాన్ని పక్కన పెట్టి వాటితో ఆడుకోవడానికి వాటి దగ్గరకు వెళ్తూ ఉంటారు.
అలాగే కొంచెం ఊహ తెలిసిన పిల్లలు అయితే పిల్లుల్ని చూసి భయపడతారు.
కానీ వీడియోలో కనిపించే చిన్నారి మాత్రం పిల్లిని చూసి ఏ మాత్రం భయపడకుండా దాని దగ్గరకు వెళ్లి ఎంచక్కా దానికి ముద్దులు పెట్టి మరి ఆ పిల్లిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది.ఆ పిల్లి కూడా ఆ చిన్నారిని చూసి ఏ మాత్రం భయపడకుండా ఆ చిన్నారికి దగ్గర అయింది.బ్యూటెంగేబిడెన్ అనే ట్యాగ్ తో ఈ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఈ వీడియోను ఇప్పటి వరకు 2.5 మిలియన్ల మంది వీక్షించారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అందరు భలే ఉంది… సో క్యూట్ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.