యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.దీంతో అఖిల్ ఆనందంగా ఉన్నాడు.
ఈ సినిమా తర్వాత అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.దీంతో ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.
ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పథకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.
తాజాగా ఏజెంట్ టీమ్ అంతా వైజాగ్ లో సందడి చేసారు.ఈయన ఈ రోజు ఉదయం వైజాగ్ స్పెషల్ విమానంలో వెళ్లగా.
అక్కడ ఘన స్వాగతం లభించింది.అక్కినేని హీరో కి స్వాగతం పలికేందుకు అఖిల్ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అఖిల్ ను స్వాగతించడానికి పెద్ద ఎత్తున అభిమానులు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాకు హిప్ హిప్ తమిజా సంగీతం అందిస్తుండగా సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.ఇక సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం అఖిల్ లుక్ ను స్టైలిష్ గా మార్చిన విషయం తెలిసిందే.మరి ఈ సినిమాతో ఈయన మాస్ ప్రేక్షకులకు దగ్గర అవుతాడో లేదో చూడాలి.