ఆర్ఆర్ఆర్ ను ఆ సినిమాతో పోల్చిన రామ్ గోపాల్ వర్మ.. నెట్టింట్లో గోలాగోలా!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది.

 The Kashmir Files Is A Gamechanger & Not Rrr Says Rgv,ram Gopal Varma, Rrr, The-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో చూసినా ఎంతో మంది ప్రముఖులు చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

అలా సినిమా పై ప్రశంసలు కురిపించిన వారిలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు.

అయితే మొదట సినిమా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మొబైల్ ఛార్జింగ్ కామెంట్ చేశాడు.

ఈ సినిమా సక్సెస్ పై స్పందిస్తూ.ది కాశ్మీర్ ఫైల్ సినిమాతో పోలిస్తే ఆర్ఆర్ఆర్ సినిమా గేమ్ చేంజర్ కాదని అభిప్రాయపడ్డాడు.

రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం మా ఇష్టం.ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రామ్ గోపాల్ వర్మ.

ఈ ఇంటర్వ్యూ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ కు ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ పై ప్రశ్న ఎదురవ్వగా.ఆ విషయం పై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.

Telugu Rajamouli, Ram Charan, Ram Gopal Varma, Rrr, Kashmir, Tollywood-Movie

ఆర్ఆర్ఆర్ సినిమా నా ప్రకారం పెద్ద సినిమానే అయినప్పటికీ అది గేమ్ చెంజర్ కాదు.ఎందుకంటే ఇది సమాజంలో మార్పు తీసుకువస్తుందని నేను అనుకోను.ఆర్ఆర్ఆర్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించి నాలుగు,ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక రకమైన సినిమా.ఇలాంటి సినిమాలను తెరకెక్కించాలంటే మీకు రాజమౌళి లాంటి గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు కావాలి అని తెలిపాడు రామ్ గోపాల్ వర్మ.

అదే ది కశ్మీర్ ఫైల్స్ సినిమా విషయానికి ఆ వస్తే అది ఒక గేమ్ చేంజింగ్ సినిమా..అలాంటి సినిమాలు దర్శకనిర్మాతలకు కావాల్సినంత నమ్మకాన్ని ఇస్తాయి అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే మొదట ఆర్ఆర్ఆర్ చాలా బాగుంది అంటూ రాజమౌళి పై, చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వేరే సినిమాతో పోల్చి తక్కువ అన్నట్లు మాట్లాడటంపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube