విదేశాలలోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, బిజినెస్ స్కూల్స్ .భారతీయ విద్యార్ధులకు ప్రపంచస్థాయి విద్యను అందించడమే కాకుండా .
వారి కెరీర్ వృద్ధిని వేగవంతం చేయడానికి సులభమైన మార్గంగా నిపుణులు చెబుతున్నారు.రష్యా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారతీయ విద్యార్ధులకు టెక్నికల్ నైపుణ్యాన్ని పెంచే డెస్టినేషన్‌లుగా గుర్తింపు పొందాయి.
అయితే వీరిలో ఎక్కువ మంది గ్లోబల్ టెక్నికల్ వర్క్ పర్మిట్ కోసం యూఎస్, యూకే, కెనడాలలోని యూనివర్సిటీలను ఆశ్రయిస్తున్నారు.
కెనడా ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ డేటా ప్రకారం.2015-16, 2019-20 విద్యా సంవత్సరాల మధ్య అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్ధుల సంఖ్య 350 శాతం పెరిగిందట.కెనడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (పీజీడబ్ల్యూపీపీ), అమెరికా ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఓపీటీ), బ్రిటన్ న్యూ గ్రాడ్యుయేట్ పాత్‌వే (జీఆర్)లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మంచి ప్లేస్‌మెంట్‌లను అందిస్తున్నాయి.
ఇవి భారతీయ విద్యార్ధులు తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
విదేశాలలో వర్క్ పర్మిట్‌లు ఆమోదం పొందే విషయంలో భారతీయ దరఖాస్తుదారులు మంచి ట్రాక్ రికార్డును కలిగి వున్నారు.
కెనడా విషయానికి వస్తే ఇక్కడి ప్రభుత్వం అందిస్తోన్న పీజీడబ్ల్యూపీపీకి భారతీయులు గడిచిన ఐదేళ్లలో 95 శాతానికి పైగా ఆమోదాన్ని దక్కించుకున్నారు.సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ (ఎస్‌టీఈఎం) లేదా బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లను అభ్యసించేందుకు భారతీయ విద్యార్ధులకు యూఎస్, యూకే, కెనడాలు మంచి ఎంపికలని నిపుణులు సూచిస్తున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మాజీ ప్రొఫెసర్ డి శర్మ ప్రకారం.యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలు తమ విద్యార్ధులకు ఆధునిక విద్య, ప్రపంచ సంస్కృతి అందించడమే కాకుండా అద్భుతమైన ఉపాధి అవకాశాలను చూపెడుతున్నాయన్నారు.
అంతేకాకుండా గడిచిన పదేళ్లలో ప్రపంచస్థాయి ప్రతిభను అభివృద్ధి చేయడంలో భారత్ అగ్రగామిగా వుందని శర్మ పేర్కొన్నారు.కోవిడ్ మహమ్మారి కారణంగా అడ్డంకులు వున్నప్పటికీ.గడిచిన రెండేళ్లలో విదేశాలలో చదువుకునే ధోరణి భారతీయులలో ఏమాత్రం తగ్గలేదని శర్మ తెలిపారు.

టెక్నికల్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులే కాకుండా మెడిసిన్ అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్ధుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది.ప్రస్తుత రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దాదాపు 18,000 మంది విద్యార్ధులు తమ మెడిసిన్ కోర్సు పూర్తి కావడానికి ముందే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.ఇండియన్ మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్ చౌదరి మాట్లాడుతూ.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేయడానికి బంగ్లాదేశ్, నేపాల్, స్పెయిన్, జర్మనీ, కిర్గిస్థాన్‌లపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు.పైగా ఈ దేశాలలో ఖర్చు కూడా చాలా తక్కువని ఆయన తెలిపారు.