చైనాలోని బ్యాంకులు, పెట్టుబడి సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు ముగింపు పలికి తమ ఉద్యోగులను కార్యాలయానికి రమ్మని పిలుస్తున్నాయి, అలాగే కార్యాలయంలోనే ఉండాలని కోరుతున్నాయి.దీంతో ఉద్యోగులు కార్యాలయంలోనే పడుకోవాల్సి వస్తోంది.
వాస్తవానికి తిరిగి చైనాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.లాక్‌డౌన్ విధించే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం చైనాలోని ప్రధాన నగరమైన షాంఘైలో లాక్‌డౌన్ అమలులో ఉంది.చైనాలోని ఈ నగరంలో వేయికి పైగా ఆర్థిక సంస్థలు ఉన్నాయి.చైనాలో అత్యంత ముఖ్యమైన స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా షాంఘైలో ఉంది.‘సీఎన్ఎన్‘ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వ్యాపారులు, ఫండ్ మేనేజర్‌లు కార్యాలయ్యాల్లో రాత్రి బస చేసేందుకు 6 వేల నుంచి 23 వేల రూపాయలు తీసుకుంటున్నారని ఓ వ్యక్తి తెలిపాడు.అదే సమయంలో, చాలా కంపెనీలు ఉద్యోగుల డెస్క్‌ల దగ్గర మడత మంచాలను కూడా ఏర్పాటు చేశాయి.
కొన్ని సంస్థలు ఉద్యోగులకు మంచాలు, సబ్బులు, ఆహారాన్ని కూడా అందజేస్తున్నాయి.
Zhong Ou అసెట్ మేనేజ్‌మెంట్ ఒక చైనీస్ సంస్థ.74 వేల కోట్లకు పైగా ఆస్తుల నిర్వహణ దీని ఆధీనంలో ఉంది.సంస్థ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్లు, ఫండ్ మేనేజర్‌లు చాలాకాలంగా రాత్రిపూట కార్యాలయంలో ఉండటం ప్రారంభించారని సంస్థ తెలిపింది.
అదే సమయంలో, ఆన్‌సైట్ చీఫ్‌గా ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ గత 15 రోజులుగా కార్యాలయంలోనే ఉన్నారు.ఈ సమాచారాన్ని కంపెనీ సోమవారం వీచాట్ ద్వారా తెలిపింది.ఫోర్‌సైట్ ఫండ్ అనే మరో సంస్థ మార్చి 16 నుండి తన ఉద్యోగులను కార్యాలయంలోనే ఉండాలని కోరింది.ఇటీవల, చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీక్సిన్‌లో ఒక ఫుటేజ్ కనిపించింది.
అక్కడ కొందరు ఉద్యోగులు పరుపుపై పడుకోవడం కనిపించింది.అలాగే బాత్‌రూమ్‌లోని సింక్ దగ్గర ఒక వ్యక్తి ముఖం కడుక్కోవడం కనిపించింది.
కాగా కార్యాలయంలో పడుకునేటప్పుడు కొందరు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.కొంతమందికి మార్బుల్ ఫ్లోర్‌లు, స్లీపింగ్ బ్యాగ్‌లపై పడుకోవడం కష్టంగా పరిణమించిది.