గుంటూరు బ్రాడీపేటలో బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి నగదు అపహరించడానికి ప్రయత్నించిన వ్యక్తి ని స్థానికులు అడ్డుకుని దేహశుద్ధి చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
బ్రాడిపేట ఇండియన్ బ్యాంక్ నుండి నగదు డ్రా చేసుకుని వస్తున్న బయటకు వస్తున్న ఓ వ్యక్తి ని బయట కాపు కాసి ఉన్న నిందితుడు కళ్లలో కారం చల్లి అతని వద్ద ఉన్న 2 లక్షల నగదు దోచుకెళ్లే ప్రయత్నం చేశారు.
వెంటనే ప్రతిఘటించిన బాధితుడు, స్థానికులు పట్టుకోపోతున్న క్రమంలో అతను రోడ్డు మీదకి పరిగెత్తి ఆటో తగిలి కింద పడ్డాడు.వెంటనే స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి స్థానిక అరుండల్ పేట పోలీసులకు అప్పగించారు.
పోలీసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.