బడ్జెట్ కలెక్షన్లను పోల్చి చూస్తే రాధేశ్యామ్ తెలుగు సినిమాలలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఫుల్ రన్ లో ఈ సినిమా 90 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తం షేర్ కలెక్షన్లను సాధించింది.
భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా ఫలితం భారీ షాకిచ్చింది.రాధేశ్యామ్ ఫ్లాప్ రిజల్ట్ వల్ల ప్రభాస్ తన రెమ్యునరేషన్ ను త్యాగం చేశారని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే థియేట్రికల్ హక్కుల వల్ల నష్టపోయిన నిర్మాతలకు డిజిటల్ హక్కుల వల్ల భారీ మొత్తంలో ఆదాయం చేకూరింది.రాధేశ్యామ్ సినిమా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే మొదట చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా ఆలస్యంగా స్ట్రీమింగ్ కావాలి.అయితే సినిమా ఫ్లాప్ కావడంతో సినిమాను ముందుగానే స్ట్రీమింగ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ రాధేశ్యామ్ నిర్మాతలకు 25 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చిందని బోగట్టా.
అమెజాన్ ప్రైమ్ నిర్ణయం వల్ల రాధేశ్యామ్ నిర్మాతలకు నష్టాలు కొంతమేర తగ్గాయి.

అమెజాన్ ప్రైమ్ లో రాధేశ్యామ్ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని సమాచారం అందుతోంది.థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్సైన ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను చూసి సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.క్లాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతోంది.

ప్రభాస్ ఈ సినిమాలో బాగానే నటించినా కథ, కథనంలోని లోపాలు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.యాక్షన్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో లవర్ బాయ్ లా కనిపించడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీ బాగుందని ప్రశంసలు వచ్చాయి.