పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకొని జిల్లాలను విభజన చేసాం సజ్జల రామకృష్ణ రెడ్డి

కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు మొత్తం పూర్తయింది ఎప్పుడయినా నోటిఫికేషన్ వస్తుంది.కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టం.

 We Have Divided The Districts On The Basis Of Parliamentary Centers Sajjala Rama-TeluguStop.com

ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం.పార్లమెంట్ కేంద్రాలను బేస్ చేసుకొని జిల్లాలను విభజన చేసాం.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే జిల్లాల ఏర్పాటు ఉండబోతుంది.ప్రజా ప్రయోజనాల అనుగుణంగా మనో భావాలు దెబ్బతినకుండా జిల్లాలు ఏర్పాటు చేసాం.

చిన్న చిన్న మార్పులతోనే తుది నోటిఫికేషన్ వెలువడబోతుంది. 90శాతం ప్రభుత్వ భవనాల్లోనే కొత్త జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం.

కొత్త జిల్లాల్లో అడ్మినిస్ట్రేషన్,పొలీస్ అడ్మినిస్ట్రేషన్ ఒకే చోటా ఉండేలా నిర్ణయం తీసుకున్నాం కొత్తగా నిర్మించే శాశ్వత భవనాలు 15 ఎకరాల్లో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు

2023 నాటికి మొత్తం కొత్త జిల్లాల శాశ్వత భవనాలు పూర్తవుతాయి.కొత్త జిల్లాల ఏర్పాటైన తరువాత వైసీపీ శ్రేణులను మోటివేట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహిస్తాం.

అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి.డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యం అవుతుందా.

ఎకరాకు 2కోట్లు అవసరం అవుతుందని సీఎం లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పారు.కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా.లక్ష కొట్లాతో రాజధాని నిర్మించడం ఏంటి.నిధులు ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చు.

ఆచరణ సాధ్యం కానీ ఆదేశాలు కాబట్టి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు మంత్రి వర్గం విస్తరణ మొత్తాన్ని సీఎం చూస్తున్నారు సీఎం జగన్ సోషల్ జస్టిస్ కు అనుగుణంగానే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు.బిసి,ఎస్సి,ఎస్టీలకు పెద్ద పీట వేసేలా క్యాబినెట్ ఎక్సర్సైస్ ఉంటుంది మెజార్టీగా క్యాబినెట్ లో మార్పులు ఉంటాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube