భారత పౌరసత్వం వదులుకున్న 6 లక్షల మంది భారతీయులు...ఎందుకో తెలుసా...

భారత దేశంలో ఉన్న ధనికులల్లో అత్యధిక శాతం మంది విదేశాలలో పెట్టుబడులు పెడుతున్న వారే.భారత్ లో తమ వ్యాపార కార్యకలాపాలు నెరుపుతూనే విదేశాలలో కూడా తమ వ్యాపార అభివృద్ధి పై దృష్టి పెడుతున్నారు.

 Over Six Lakh Indians Gave Up Citizenship, Indians, Indian Citizenship,covid Eff-TeluguStop.com

ఈ క్రమంలో ఆయా దేశాలు ఇస్తున్న ఆఫర్ల కు ధనికులు ఆకర్షితులు అవడమే కాకుండా ఆదేశ శాశ్వత సభ్యత్వం పొందుతున్నారు.ఇలా ప్రతీ ఏటా ఎంతో మంది భారతీయ ధనికులు దేశం విడిచిపెట్టి విదేశాలకు శాశ్వత నివాసం కోసం వెళ్ళిపోతున్నారు.

హెన్లీ అండ్ పార్టనర్స్ సంస్థ సర్వే నివేదికను పరిశీలిస్తే.

భారత్ లో గడిచిన ఐదేళ్ళలో సుమారు 6 లక్షల మంది భారతీయులు విదేశాలలో శాశ్వత నివాసం కోసం భారత పౌరసత్వం వదులుకున్నట్లుగా సదరు సర్వే ప్రకటించింది.2020 తో పోల్చితే ఈ సంఖ్య సుమారు 54 శాతం పెరిగిందట.ఇలా వలసలు వెళ్ళిన వారిలో అత్యధికంగా అమెరికా, బ్రిటన్ కు వెళ్ళిన వారే ఎక్కువగా ఉన్నారట.

భారత విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ఈ విషయాలను ధృవీకరించింది.ఈ 6 లక్షల మందిలో సుమారు 40 శాతం మంది అమెరికా వెళ్ళిపోగా మిగిలిన వారిలో చాలా మంది గోల్డెన్ వీసాల ద్వారా పలు దేశాలలో స్థిరపడ్డారట.

Telugu Covid Effect, Foreign, Indians, Indiansgave-Telugu NRI

2019 లో 1.44 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారు.అయితే ఈ సంఖ్య 2020 కి వచ్చేసరికి బాగా తగ్గుముఖం పట్టిందట ఎందుకంటే కరోనా ప్రభావం వలసలపై తీవ్ర ప్రభావం చూపడమే అందుకు కారణమని అయితే ఈ సమయంలో కూడా 85 వేల మందికి పైగా దేశం విడిచి వెళ్ళారని తెలుస్తోంది.2021 నాటికి 1.11 లక్షల మంది విదేశాలకు వెళ్ళారని 2019 తో పోల్చితే ఈ సంఖ్య తక్కువేనని సర్వే వెల్లడించింది.గతంలో భారతీయులు అమెరికా, బ్రిటన్ ల పౌరసత్వం కోరుకునే వారని కానీ కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియా, మాల్టా గ్రీస్ దేశాల వైపు మళ్లుతున్నారని తెలుస్తోంది.

ఇలా వలసలు వెళ్ళిన వారందరూ అక్కడ వ్యాపార రంగంలో అడుగు పెడుతూ భారీ లాభాలను ఆర్జిస్తున్నారని సదరు సర్వే వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube