పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం సేకరిస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ధాన్యం సేకరించడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజను FCI కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతన్నల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
వ్యత్యాసం ఎందుకు చూపెడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెలరేగారు.ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, గ్రంధాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్, జెడ్పీటీసీ రాం మూర్తి, బండారి శ్రీనివాస్, రాజ్ కుమార్ తో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
.