రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రికార్డులు క్రియేట్ అవుతాయనే సంగతి తెలిసిందే.సాధారణంగా చాలా సినిమాలు విడుదలైన తర్వాత రికార్డులు క్రియేట్ చేస్తాయి.
అయితే ఆర్ఆర్ఆర్ మాత్రం రిలీజ్ కు ముందే రికార్డులను క్రియేట్ చేస్తోంది.పవన్ కళ్యాణ్ తన సినిమా ద్వారా క్రియేట్ చేసిన రికార్డును ఆర్ఆర్ఆర్ మూవీ బ్రేక్ చేయడం గమనార్హం.
అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను క్రియేట్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఏకంగా 6.17 కోట్ల రూపాయలు వచ్చాయి.కేవలం నైజాం ఏరియాలో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా భీమ్లా నాయక్ కు ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 6.42 కోట్ల రూపాయలు వచ్చాయి.ఆర్ఆర్ఆర్ సులువుగానే ఈ రికార్డును బ్రేక్ చేసింది.
ఆర్ఆర్ఆర్ విడుదలకు ఒకరోజు సమయం ఉన్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.రిలీజ్ కు ముందే రికార్డులను సొంతం చేసుకుంటున్న ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులను సాధిస్తుందో చూడాల్సి ఉంది.టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి క్యూ కడుతున్నారు.
తొలిరోజే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఓవర్సీస్, కర్ణాటక ఏరియాలలో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ హవా కొనసాగుతోంది.ఐదు భాషల్లో రికార్డు స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.