టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముందువరసలో ఉంటారు.తాజాగా సుమతో జరిగిన ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు.
సుమ మీమ్స్ చూపించడం ద్వారా ఈ ఇంటర్వ్యూలో ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులు పూయించారు.ఎన్టీఆర్ సుమతో మాట్లాడుతూ సుమకు గడుసు అత్త ముసలావిడ పాత్రలు బాగుంటాయని రాజీవ్ నోరు లేని మొగుడు పాత్రలో ఉంటాడని చెప్పుకొచ్చారు.
ఆర్ఆర్ఆర్ రిలీజవుతుందని చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఏంటని తారక్ ను సుమ అడగగా నాకింకా నమ్మకం లేదంటూ తారక్ చెప్పుకొచ్చారు.2020 సంవత్సరంలోనే రిలీజ్ అవుతుందని నమ్మకమని అయితే అందుకు భిన్నంగా జరిగిందని రాజమౌళి తెలిపారు.ఆర్ఆర్ఆర్ గురించి వైరల్ అయిన మీమ్స్ ను చూసి తారక్, చరణ్, జక్కన్న నవ్వుకున్నారు.తారక్ ను హ్యాండిల్ చేయడం సాధారణ విషయం కాదని సుమ కనకాల కామెంట్లు చేశారు.

బీపీ బాగా ఎక్కువైతే రాజమౌళి మైక్ పగలగొట్టి బూతులు మాట్లాడతారని తారక్ అన్నారు.రాజమౌళి 2020 లోనే సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పిన వీడియోను సుమ చూపించగా చరణ్, ఎన్టీఆర్ పకపకా నవ్వారు.ఈగ సినిమానే జక్కన్న రెండేళ్లు తీశారని తారక్ తెలిపారు.రాత్రి కలలో కూడా నాటునాటు స్టెప్పులు వేసేవాళ్లమని తారక్ చెప్పుకొచ్చారు.ఇంక ఆపు జక్కన్న అని చెబుతానని చరణ్ మనసులో ఫీలింగ్ కూడా అదేనని తారక్ తెలిపారు.

రాజమౌళి నాటు నాటు స్టెప్ ఫ్రీజ్ చేసి చూసేవారని కాలు పైకి ఉందని చెప్పి మళ్లీ చేయించేవారని తారక్ చెప్పుకొచ్చారు.నాకో స్టైల్ ఉందని రాజమౌళి చెప్పేవారని తారక్ చెప్పుకొచ్చారు.నాటు నాటు 17 టేకుల తర్వాత రెండో టేక్ ఓకే చేశారని చరణ్ తెలిపారు.
చరణ్, ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా చేయలేకపోవడం వల్ల తాను రెండో టేక్ ఫైనల్ చేశానని రాజమౌళి కామెంట్లు చేయడం గమనార్హం.