ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యాం సినిమా విడుదలకు సిద్ధమైంది.మరి కొన్ని గంట ల్లో ప్రపంచ వ్యాప్తం గా ఈ సినిమా థియేటర్ స్క్రీన్ కి రెడీ గా ఉంది.
ఒక రోజు ముందు గానే అంటే కాసేపట్లోనే ఆట పడబోతుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా ఎంత భారీగా తెరకెక్కిందో అంతే భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.గతం లో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్ ఆ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
ముఖ్యం గా ప్రభాస్ ఈ సినిమా కోసం ముంబై చెన్నై ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో కూడా పర్యటించి ఈ సినిమా ను భారీ ఎత్తున ప్రమోషన్ చేయడం జరిగింది.తాజాగా రాజమౌళి తో ప్రభాస్ ఇంటర్వ్యూ కూడా జరిగింది.
సినిమా గురించిన పలు విషయాలను మరియు పలు ఆసక్తికర సంఘటనల ను రాజమౌళి ద్వారా ప్రేక్షకులకు ప్రభాస్ తెలియ జేశాడు.ఈ సమయంలో ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా రాజమౌళి ప్రభాస్ ని ఒక ప్రశ్న అడగడం జరిగింది.
ఆ ప్రశ్న ఏంటంటే… బాహుబలి సినిమా సమయంలో నువ్వు ఇంత యాక్టివ్ గా ప్రమోషన్ లో పాల్గొనలేదు, ప్రమోషన్ కార్యక్రమం అంటే సిగ్గు పడుతూ, ఇబ్బంది పడుతూ ఉండే వాడివి.కానీ ఇప్పుడు ఎందుకు ఇంత యాక్టివ్ గా మారావు.
నీలో ఇంత మార్పుకు కారణం ఏంటి అని ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నకు ప్రభాస్ స్పందిస్తూ ఇదంతా మీ వల్లనే అంటూ సమాధానమిచ్చాడు.బాహుబలి సమయంలో ఒక్కొక్క రోజూ 40 ఇంటర్వ్యూలు ఇచ్చాను.ఆ సమయంలో నాలో ఉన్న భయం మరియు ఇతర ఇబ్బందికరమైన విషయాలన్నీ మాయమైపోయాయి.
ముంబైలో మీడియా ముందు కూర్చున్న సమయంలో నాకు భయంతో వణుకు వచ్చింది.ఆ సమయం లో మీరు ఇచ్చిన ధైర్యం తోనే నేను ఆ రోజు మాట్లాడగలిగా అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.
రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పీక్స్ లో జరిగాయి.ఫలితం ఏంటీ అనేది కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.