నటుడు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి - నాయి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్

నటుడు మంచు మోహన్ బాబు నాయి బ్రాహ్మణ కులస్తులందరికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్ చేసింది.ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నటుడు మోహన్ బాబు దగ్గర హెయిర్ డ్రస్సర్స్ గా పనిచేస్తున్న నాయి బ్రాహ్మణ కులస్తుడు నాగం శ్రీనును కులం పేరుతో దూషించటాన్నీ,కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.

 Actor Mohan Babu Should Apologize - Nai Brahmin Seva Sangham Demand-TeluguStop.com

ఇప్పటికైనా మోహన్ బాబు తక్షణమే యావత్ నాయి బ్రాహ్మణ కులస్తులందరికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళన లు చేపడుతామని హెచ్చరించారు.మీడియా సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నంద్యాల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి మాధరపు హరినాధ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube