తెలంగాణ బీజేపీ ఇక మెల్ల మెల్లగా తనదైన రాజకీయ విధానాన్ని అమలు చేసి ఇక టీఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో బీజేపీ అనేది కాస్త బలపడుతూ వస్తోంది.
అయితే గతంలో పనిచేసిన అధ్యక్షులతో పోలిస్తే బండి సంజయ్ మాస్ లీడర్ షిప్ తో మాత్రమే బీజేపీ ఎంతో కొంత టీఆర్ఎస్ పోటీనిచ్చేలా ప్రస్తుతం ఉంది.అయితే ఎప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో బీజేపీ లో సీఎం అభ్యర్థి ఎవరు అనే చర్చ జోరుగా మొదలైన వేళ బండి సంజయ్ ఈ ప్రచారం పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి సీఎం అవుతారని, నాకు సీఎం పదవి మీద ఆశ లేదని పార్టీని అధికారం లోకి తీసుకురావడమే నా బాధ్యత అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.అయితే ప్రస్తుతం బండి సంజయ్ నుండి ఎవరు సీఎం అనే విషయంలో తన అభిప్రాయాన్ని ఎలాగైనావ్యక్తం చేసేలా చేయడం జరిగింది.
అయితే బండి సంజయ్ చీఫ్ గా నియామకం అయిన తరువాత మాత్రమే బీజేపీ అనేది పెద్ద ఎత్తున బలపడిన పరిస్థితి ఉంది.కాని బండి సంజయ్ మాత్రం కిషన్ రెడ్డి సీఎంగా కావాలని చెప్పడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందనే దానిపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.అయితే బండి సంజయ్ అభిప్రాయం ఫైనల్ కాదు కాబట్టి ఎన్నికల తరువాతే దీనిపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.