ఏజెంట్ సినిమాలో మెగాస్టార్ లుక్ రివీల్.. 'ది డెవిల్' అంటూ పరిచయం !

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.దీంతో అఖిల్ ఆనందంగా ఉన్నాడు.

 Malayalam Megastar Mammootty's Character Poster From Agent, Malayalam Megastar,-TeluguStop.com

ఈ సినిమా తర్వాత అఖిల్ ప్రెసెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‘ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.దీంతో ఈ సినిమా కూడా హిట్ అయితే అఖిల్ కు మాస్ ప్రేక్షకుల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోవడం ఖాయం.

ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం అఖిల్ లుక్ ను ఏ విధంగా స్టైలిష్ గా మార్చాడో ఇప్పుడు విలన్ ను కూడా అంతే స్టైలిష్ లుక్ లోకి మార్చినట్టు తెలుస్తుంది.

తాజాగా ఈ సినిమా నుండి మలయాళ మెగాస్టార్ మమ్ముటి ఫస్ట్ లుక్ ను అభిమానులకు పరిచయం చేసాడు.ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

ది డెవిల్ అంటూ మమ్ముట్టిని ఏజెంట్ అభిమానులకు పరిచయం చేసారు.

Telugu Akhil, Malayalam, Mammootty-Movie

ఈ లుక్ ఆయన అభిమానులను మాత్రమే కాదు మాములు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పథకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు హిప్ హిప్ తమిజా సంగీతం అందిస్తుండగా సాక్షి వైద్య కథానాయికగా నటిస్తుంది.

మరి ఈ మాస్ ఎంటర్టైనర్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube