మౌనం వహిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... పోటీకి సిద్ధమవుతున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో గత ఎన్నికలలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కొంతలో కొంత బీజేపీ అనేది టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేసింది.అయితే ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో పాటు బీఎస్పీ, వైయస్సార్ టీపీ పార్టీలు టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది.

 Rs Praveen Kumar Silence Is He Preparing For The Competition Details, Kcr, Trs P-TeluguStop.com

అయితే ప్రస్తుతం బీఎస్పీ పార్టీ తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నిస్తూ అదే విధంగా బీఎస్పీ సిద్దాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ బీఎస్పీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పావులుకదుపుతున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలాగా జోరుగా బహిరంగ విమర్శలు చేయకున్నా కేవలం బలంతోనే సమాధానం చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇంకా ప్రవీణ్ కుమార్ చిన్న కామెంట్ కూడా చేయకున్నా సరైన సమయంలో స్పందించే అవకాశం ఉంది.ఇటు షర్మిల పార్టీపై కాని, బీఎస్పీ పార్టీపై కాని కెసీఆర్ ఏ మాత్రం స్పందించకున్నా వీటి పట్ల  ముఖ్యమంత్రి కెసీఆర్ కాస్త వ్యూహాత్మకంగా కదిలే అవకాశం ఉంది.

Telugu @cm_kcr, Bsp, Cm Kcr, Telangan, Telangana, Ys Sharmila-Political

ఎందుకంటే కెసీఆర్ తనకు ముచ్చటగా గెలిచే అవకాశం లేకుండా ఏ పార్టీలనేవి కాస్త అడ్డుగా మారతాయని భావిస్తే వాటిని ఎదుర్కోవడంలో చాలా వ్యూహాత్మక శైలిలో వెళ్ళే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ మాత్రం కాస్త మౌనం వహిస్తున్నా ఎంత మేరకు సాంప్రదాయ రాజకీయ పార్టీలను ఎదుర్కొంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.ఏది ఏమైనా ఒక రిటైర్డ్ ఐపీఎస్ ప్రస్తుతం ధన రాజకీయాల్లో ఏ మేరకు కేవలం సిద్దాంతంతో ఏ మేరకు ఆకట్టుకుంటారనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube