ఆ హీరోతో రిలేషన్ గురించి అసలు విషయం బయట పెట్టిన లైగర్ బ్యూటీ అనన్య!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతున్న అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.

 Liger Beauty Ananaya Revealing The Real Thing About The Relationship With That H-TeluguStop.com

ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి అనన్య పాండే బాలీవుడ్ నటుడు ఇషాన్ తో ప్రేమలో ఉందంటూ పెద్దఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.అయితే ఈ విషయం గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

Telugu Ananya, Ananya Pandey, Bollywood, Ishaan, Liger, Puri Jagannath, Relation

కానీ వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లడం ఎంజాయ్ చేయడం చూస్తుంటే తప్పకుండా రిలేషన్ లోనే ఉన్నారనే తెలుస్తోంది.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఓ పని చూస్తుంటే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అందరికీ అర్థం అయింది.సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉండే అనన్య పాండే సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో తన ఫేవరెట్ హీరో,తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడారు.ఈ క్రమంలోని ఒక నెటిజన్ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మాట్లాడగా ఈ ముద్దుగుమ్మ ఆ ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.

Telugu Ananya, Ananya Pandey, Bollywood, Ishaan, Liger, Puri Jagannath, Relation

ఈ క్రమంలోనే మరొక నెటిజన్ తన ఫేవరెట్ హీరో ఎవరు అని అడగగా… అనన్య పాండే ఏ మాత్రం ఆలోచించకుండా తన ఫేవరేట్ హీరో ఇషాన్ అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.ఈ క్రమంలోనే కొందరు తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇండైరెక్ట్ గా సమాధానం చెప్పారని ఈమె హీరో ఇషాన్ తో రిలేషన్ లో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.గత కొద్ది రోజులుగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ వీరి రిలేషన్ గురించి అనుమానపడ్డారు.ఈ క్రమంలోనే అనన్య పాండే తనతో ఉన్న రిలేషన్ గురించి ఇండైరెక్టుగా హింట్ ఇచ్చారని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube